Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైమానిక దాడి.. 30 మంది దుర్మరణం

పాకిస్తాన్ వాయుసేన తన సొంత దేశంలోని ప్రజలపైనే వైమానిక దాడులు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. సొంత ప్రజలపైనే నరమేధాన్ని సృష్టించిన విచిత్రమైన దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఈ దాడులు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగాయి. సోమవారం తెల్లవారుజామున వరుసగా 8 బాంబులు వేసి ఒక నరసంహారాన్ని సృష్టించింది. ఈ దాడుల్లో మహిళలు పిల్లలతో సహా 30 మంది పౌరులు మరణించారు. ఈ దుర్ఘటన దేశంలో భద్రతా బలగాల చర్యలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సెప్టెంబర్ 21- 22 మధ్య రాత్రి సుమారు 2 గంటలకు తిరాహ్ లోయలో ఉన్న మత్రే దారా గ్రామంపై యుద్ధ విమానాలతో చేసిన ఈ దాడికి పాల్పడింది పాక్ వాయుసేన.

శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు
ఈ దాడిలో జేఎఫ్-17 యుద్ధ విమానాలను ఉపయోగించి గ్రామంపై 8 ఎల్ఎస్-6 బాంబులు వేశారు. ఈ దాడిలో గ్రామంలోని 5 ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు, దీనిలో 30 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కూడా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడి తర్వాత గ్రామంలో భయంకరమైన పరిస్థితులకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. ఈ వీడియోల్లో మహిళలు, పిల్లలతో సహా అనేక మంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

Pakistan Air Force Bombs Own Citizens 30 Civilians Killed in Khyber PakhtunkhwaPakistan Air Force Bombs Own Citizens 30 Civilians Killed in Khyber Pakhtunkhwa

ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో దాడులు
పాకిస్తాన్ సర్కారు ఈ దాడులను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా చేపట్టినట్లు చెబుతోంది. అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాద ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక పోలీసుల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు వరకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 605 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో 138 మంది పౌరులు, 79 మంది పాకిస్తానీ పోలీసులు మరణించారు. కేవలం గత నెలలోనే 129 ఉగ్రవాద ఘటనలు జరిగాయని, వీటిలో 6 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఆపరేషన్లు జరిగి పౌరుల మరణాలకు కారణమయ్యాయి. ఈ తాజా దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత ప్రజల రక్షణ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తోందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+