పాక్ యుద్ధ విమానం కుప్పకూలి పైలెట్ మృతి

కరాచీ: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. యుద్ధ విమానం బూడిద అయ్యింది. విమానంలో ఉన్న పైలెట్ సైతం సజీవదహనం అయ్యాడు. పాక్ లోని మస్రూర్ బేస్ నుంచి యుద్ధ విమానం బయలుదేరింది.

మార్గం మధ్యలో కరాచీకి 17 కిలోమీటర్ల దూరంలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Pakistan air Mirage fighter Jet Crashes, Pilot killed near Karachi

ట్రైనింగ్ మిషన్ లో భాగంగా ఈ విమానం మస్రూర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత ప్రమాదం జరిగిందని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు. జనావాసాలకు దూరంగా యుద్ధ విమానం పడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని వివరించారు.

ఫ్రాన్స్ లో ఈ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది ? అని విచారణకు ఆదేశించామని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. గత నెలలో పాక్ యుద్ద విమానం కుప్పకూలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+