Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pakistan: ఇంధనానికి డబ్బులు లేక విమానాలు రద్దు చేసిన పాకిస్థాన్ ఎయిర్‍లైన్స్..

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ దేశంలో విమాన ఇంధనం లేక విమానాలను రద్దు చేశారు. ఆ దేశ జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA), ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అనేది ఆ దేశ ప్రభుత్వం సంస్థ. ఎయిర్ లైన్స్ ఇంధనానికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఇంధన సంస్థలు సరఫరా తగ్గించాయి. దీంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో 13 దేశీయ విమానాలు, అంతర్జాతీయ మార్గాల్లో 11 విమానాలు రద్దు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. మరో పన్నెండు విమానాలు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. బుధవారం కూడా PIA డజనుకు పైగా విమానాలను రద్దు చేసింది . 16 అంతర్జాతీయ, ఎనిమిది దేశీయ విమానాలు ఉన్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ (PSO) చెల్లించని బకాయిల కారణంగా సరఫరాను నిలిపివేయడం వల్ల PIA విమానాలకు ఇంధన కొరత ఏర్పడింది.

Pakistan Airlines canceled flights due to lack of money for fuel

పేరుకుపోయిన అప్పుల కారణంగా ఇప్పటికే పతనం అంచున ఉంది. దీంతో ఈ ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది. జాతీయ విమానయాన సంస్థ కోరినప్పటికీ, నిర్వహణ ఖర్చులకు మద్దతుగా రూ. 23 బిలియన్లను అందించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించడంతో పరిస్థితి మరింత తిగజారింది. PIAకి PSO నుంచి ఇంధనం కోసం రోజుకు రూ. 100 మిలియన్లు అవసరమవుతాయి.

రాజకీయ అస్థిరతతోపాటు పాకిస్థాన్ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగానికి పడిపోయింది. ఆ దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు $10 బిలియన్ల వద్ద అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి.

సెప్టెంబరులో దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటాయి. ప్రధానమంత్రి అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలను లీటరుకు రూ.14.91 మరియు రూ.18.44 చొప్పున పెంచింది. పెంపుతో పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరింది.

పెరుగుతున్న కరెంటు బిల్లులపై పాకిస్థాన్‌లో కూడా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముల్తాన్, లాహోర్, కరాచీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)తో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు, ప్రజలు తమ బిల్లులను తగలబెట్టిన భారీ ప్రదర్శనలు చూశాయి. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. నగదు కొరత ఉన్న దేశం ఏడాది మొదటి ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 8 లక్షల మందికి పైగా దేశం విడిచి వెళ్లారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదని పాకిస్థాన్ ను చూస్తే స్పష్టం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+