కులభూషణ్ జాదవ్ కేసు : భారత లాయర్ నియామకానికి 'నో' చెప్పిన పాకిస్తాన్...
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ చెరలో బంధీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను విడిపించేందుకు భారత్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాక్ నుంచి మాత్రం ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. పాక్ కోర్టుల్లో జాదవ్ తరుపున వాదించేందుకు తమ లాయర్లకు అనుమతినివ్వాలన్న భారత్ విజ్ఞప్తిని ఆ దేశం కొట్టిపారేసింది.
Recommended Video
'జాదవ్ కేసులో భారత్ చేసే అసమంజసమైన డిమాండ్లను పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు.' అని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కోర్టులకు సహకరించడం తప్ప భారత్‌కు మరో ఆప్షన్ లేదన్నారు. కేవలం స్థానిక న్యాయవాదులకు మాత్రమే పాక్ కోర్టుల్లో వాదించేందుకు అనుమతి ఉంటుందన్నారు.

నిజానికి జాదవ్ తరుపున భారత న్యాయవాది నియామకానికి గతంలోనే పాక్ అవకాశం కల్పించిందని... కానీ భారత్ దాన్ని ఉపయోగించుకోలేదని నెల క్రితం పాకిస్తాన్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు భారత్ మాత్రం పాకిస్తాన్ నుంచి తమకెలాంటి సమాచారం అందలేదని చెప్పింది.
అంతకుముందు, ఇస్లామాబాద్ హైకోర్టు కులభూషణ్ జాదవ్ తరుపున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమాచారాన్ని భారత్‌కు పంపించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కులభూషణ్ జాదవ్ తరుపున న్యాయవాది నియామకానికి భారత్ పాక్‌కు విజ్ఞప్తి చేయగా... పాకిస్తాన్ దాన్ని తోసిపుచ్చింది.
కాగా,గూఢచర్యం ఆరోపణలతో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించగా... భారత్ దాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసి స్టే తెచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి కులభూషణ్ జాదవ్‌ను 2016,మార్చి 3న బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేశారన్నది భారత్ వాదన. కానీ పాకిస్తాన్ మాత్రం ఆయన్ను ఇరాన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతోంది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications