• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆస్తుల వివరాలు వెల్లడించని 261 ప్రజాప్రతినిదులపై వేటు

By Narsimha
|

ఇస్లామాబాద్: ఆస్తుల వివరాలు వెల్లడించని మొత్తం 261 మంది ప్రజాప్రతినిధులను సస్పెండ్‌ చేస్తూ పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం తీవ్ర సంచలన నిర్ణయం తీసుకుంది.

Pakistan Election Commission suspends 261 lawmakers for not declaring assets

సస్పెన్షన్‌కు గురైన ప్రముఖుల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ సభ్యుడు కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దర్‌, పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఎంపీ అయేషా గులాలయ్‌ మత వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్‌ యూసఫ్‌, పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ ఫెహ్‌మిదా మిర్జా కూడా ఉన్నారు.

ఈసీ వేటుకు గురైన వారిలో ఏడుగురు సెనేటర్లు, ఎంపీలు 71 మంది, పంజాబ్‌ అసెంబ్లీ సభ్యులు 84 మంది, సింధ్‌ అసెంబ్లీ సభ్యులు 50 మంది, ఖైబర్‌-ఫఖ్తున్‌ఖ్వాకు చెందిన 38 మంది, బలోచిస్తాన్‌ సభ్యులు 11 మంది ఉన్నారు.

ప్రజాప్రతినిధులు, వారి కుటుంసభ్యులు తమ ఆస్తుల వివరాలు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఎన్నికల సంఘం గడువు గతంలో విధించింది.

అవినీతిని రూపు మాపుతానంటూ గత పాలకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ తెచ్చిన ఈ చట్టంతో ఎటువంటి ప్రయోజనం లేదని ఇప్పటికే రుజువైందని పరిశీలకులు చెబుతున్నారు.

ప్రజాప్రతినిధులంతా ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలను ఈసీకి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, సస్పెన‍్షన్‌కు గురైన వారంతా ఎన్నికల సంఘానికి తమ ఆస్తుల వివరాలు అందజేస్తే వారిపై ఎటువంటి చర్యలు ఉండవు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Election Commission of Pakistan (ECP) on Monday suspended the membership of 261 lawmakers of the senate, and national and provincial assemblies for failing to submit their statements of assets and liabilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more