వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ సొంత డబ్బా.. ట్రంప్ పాక్ ను పొగడలేదు!

అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇదంతా పాక్ సొంత డబ్బానే తప్పా.. అసలు పాకిస్థాన్ పై ట్రంప్ ఎలాంటి ప్రశంసలు కురిపించలేదని ఆయన అధికారిక బృందం తేల్చి చెప్పింది.

కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఫోన్ కాల్ ద్వారా అభినందనలు తెలియజేయగా.. 'పాకీస్తానిలు అత్యంత తెలివిగలవాళ్లు.. ప్రధానిగా మీకు మంచి పేరుంది. మీరు పాకిస్తాన్ ను ముందుకు నడిపిస్తున్న తీరు అద్భుతం. త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. మీతో మాట్లాడుతుంటే.. ఓ ప్రధానితో మాట్లాడిన భావన కంటే చాలా కాలంగా పరిచయమున్న ఓ వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి పాత్ర పోషించడానికైనా నేను సిద్దంగా ఉన్నాను. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే జనవరి20 కన్నా ముందు వరకు ఏ సమయంలో అయినా మీరు నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు' అంటూ పాక్ పై ప్రశంసలు కురిపించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Pakistan false publicity on Trump

సాధారణంగా ఓ విదేశీ అధినేతతో జరిగిన చర్చ గురించి ప్రధాని కార్యాలయం నుంచి కటన రూపంలో వివరణ వెలువడదు. కానీ పాక్ అందుకు విరుద్దంగా ట్రంప్ తమ దేశంపై ప్రశంసలు కురిపించారని చెప్పుకోవడం గమనార్హం. పాక్ ప్రకటన మొత్తం అలంకారాలు, అతిశయోక్తులతో నిండివున్నది తప్పితే.. ఈ ప్రకటనకు ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

English summary
On thursday hearing about trump praises pakistan that was shocked every one. But the fact is pakistan made false publicity said America
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X