పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని ముషారఫ్‌ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌ వెల్లడించింది

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని ముషారఫ్‌ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌ వెల్లడించింది.

1943 ఆగస్టు 11న ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి దశలవారీగా దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేసి అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు.

pakistan former president pervez musharraf passed away

పాక్‌ సైనికదళాల ప్రధానాధికారిగా ముషారఫ్ పనిచేశారు. 1999లో నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేశారు. అనంతరం సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్. 2016 నుంచి ఆయన దుబాయిలోనే ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+