పాకిస్థాన్‌ కు ఇరాన్‌ బిగ్ షాక్.. 12 కేజీల LPG సిలిండర్ ధర రూ. 10 వేలు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలోకి పడిపోయినట్లుగా తయారైంది.

ఇరాన్‌ తో ఉన్న రెండు కీల‌క స‌రిహ‌ద్దు మార్గాల‌ను పాకిస్థాన్ మూసివేయ‌డంతో ఆ దేశానికి ఎల్‌ పీజీ ఎగుమ‌తుల‌ను ఇరాన్ నిలిపివేసింది. దాంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పరిస్థితి మూలిగే న‌క్క‌మీద తాటిపండు ప‌డ్డ‌ట్లు అయింది. సాధారణంగా ఇరాన్ నుంచి నిత్యం 7 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటుంది. అయితే తాజాగా ఇరాన్ ఎల్పీజీని నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్ లో ఎల్పీజీ కొరత ఆకాశాన్ని తాకుతోంది.

ఈ క్రమంలో పాకిస్థాన్ లో ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 12 కేజీల సిలిండర్ ధర రూ. 4,500 నుంచి రూ. 7000 వరకు బలూచిస్థాన్ లో పెరిగింది. అలాగే లాహోర్ లో అయితే రూ. 7,500 లకు చేరింది. స్కర్దు ప్రాంతంలో 12 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 8,200 గా ఉందని రాయిటర్స్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. అలాగే సిలిండర్ ధరలు ఖైబర్ పంఖ్తున్ఖ్వా ప్రాంతంలో అయితే ఏకంగా రూ. 10 వేలు దాటినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Pakistan from Iran Big shock LPG exports haltedBig shock to Pakistan from Iran LPG exports halted

ఇక ఇరాన్ నుంచి ఎగుమతులు నిలిపివేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో సిలిండర్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఇక పాకిస్థాన్ లో సామాన్య ప్రజలు సిలిండర్ ను కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ కు చెందిన ఇరాన్- గబ్-రిమ్దాన్ అలాగే తఫ్తాన్ మార్గాలను అక్టోబర్ 17న పాకిస్థాన్ మూసివేసింది. దాంతో పాకిస్థాన్ కు ఎల్పీజీ ఎగుమతులను నిలిపివేస్తూ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+