వామ్మో.. 11 కేజీల సిలిండర్ ధర రూ. 5000 వేలకుపైనే.. ఇదీ పాకిస్థాన్ పరిస్థితి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాల్లో పరిస్థితి దారుణంగా మారింది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో మునిగిపోయాయి. అటు పాకిస్థాన్ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకానమీ.. ఇప్పుడు మరింత దిగజారింది. ఇప్పటికే ఆ దేశంలో లాక్ డౌన్, ఎనర్జీ లాక్ డౌన్ విధించారు. అయితే పాకిస్థాన్ లో ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ గ్యాస్ దొరకడం అసాధ్యంగా మారింది. ప్రస్తుతం భారత్ లో కొత్త గ్యాస్ సిలిండర్ కావాలంటే 30 రోజులు పడుతుండగా.. అదే పాకిస్థాన్ లో పరిస్థితి భిన్నంగా ఉంది.

పాకిస్థాన్ లో గ్యాస్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దేశంలో బ్లాక్ మార్కెట్ రాజ్యమేలుతోంది. ఏది కొనాలన్నా బ్లాక్ మార్కెట్ లో అత్యధిక ధరలకు కొనాల్సి వస్తోంది. దాంతో అక్కడి పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. హార్మూజ్ జలసంధి మూసివేయడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టం అవుతోంది. ఇక పాకిస్థాన్ అత్యధికంగా ఎల్పీజీ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటోంది. హార్మూజ్ మూసివేత కారణంగా సరఫరా పూర్తిగా దెబ్బతింది. దాంతో ఆ దేశంలో ఈ పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర పాకిస్థాన్ లో ఆకాశాన్ని తాకుతుంది. మార్చి- ఏప్రిల్ 2026.. లో 11.8 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3900 నుంచి 5100 మధ్య పలుకుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ధర మరింతగా పెరుగుతోంది. అధికారిక ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు మార్కెట్ లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. 2026 మార్చి లో గ్యాస్ సిలిండర్ ధరలు దాదాపు రూ. 4, 139 గా ఉంది. అయితే కొన్ని దుకాణాల్లో ఈ ధర ఇంకా ఎక్కువగా ఉంది.

Pakistan Gas Crisis Price of 11kg LPG Cylinder Crosses 5 000 Mark Amid Rising West Asia Tensions

భారత్ లో 30 రోజులకు కొత్త సిలిండర్ వస్తుండగా.. పాకిస్థాన్ లోని పెద్ద పెద్ద నగరాలైన కరాచీ, లాహోర్ మాత్రం నెలలు పడుతున్నట్లు సమాచారం. కానీ గ్రామాల్లో మాత్రం ఇంకా ఎక్కువ రోజులే పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. తక్కువ సరఫరా, అత్యధిక డిమాండ్ కారణంగా.. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోయింది. మరోవైపు పాకిస్థాన్ లో అధిక ద్రవ్యోల్బణం ఉంది. అక్కడి కరెన్సీ విలువ పతనమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+