లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!

ఇప్పటికే పాకిస్తాన్ పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి బయటపడటానికి ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తోందా దేశం. ఇప్పుడు తాజాగా పెట్రోల్, డీజిల్ పై రూ.35ను పెంచింది.

ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురిపోతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిందా దేశం. ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ధాన్యాలు, నిత్యావసర సరుకులను తీసుకెళ్లే లారీలు, భారీ ట్రక్కులపై స్థానికులు దాడులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ఇప్పటికే ఆకాశాన్నంటాయి. లీటర్ ఒక్కింటికి 200 రూపాయలను దాటేశాయి.

 బెయిల్ అవుట్ కోసం..

బెయిల్ అవుట్ కోసం..

అప్పుల సంక్షోభం నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఐఎంఎఫ్ ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు వారి షెడ్యూల్ కూడా ఖరారైంది. పాకిస్తాన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత- బెయిల్ అవుట్ ప్యాకేజీపై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది.

 డాలర్ తో

డాలర్ తో

డాలర్ పై పాకిస్తాన్ రూపాయి విలువ 250 రూపాయలను దాటింది. ఒక్కో డాలర్ కు 250 రూపాయలను చెల్లించాల్సిన సంకటాన్ని ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్ పై లీటర్ ఒక్కింటికి 35 రూపాయలను పెంచింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం.

పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..

పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..

ఈ పెంపు తరువాత లీటర్ పెట్రోల్ రూ.249.80 పైసలు, డీజిల్ 262.80 రూపాయలకు చేరింది. ఈ ఉదయం 11 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చినట్లు పాకిస్తాన్ మీడియా డాన్ తెలిపింది. వాటి రేట్లను ఎకాఎకిన పెంచుతున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. దీనికోసమే ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 ప్రభుత్వం ఏం చెబుతోంది..

ప్రభుత్వం ఏం చెబుతోంది..

పెట్రోల్, డీజిల్ ధరలను హఠాత్తుగా లీటర్ ఒక్కింటికి 35 రూపాయల మేర ఎందుకు పెంచాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత ఇచ్చారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ అధికారుల సూచనల మేరకు పెట్రోల్, డీజిల్ రేట్లను ఇప్పటికప్పుడు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.

 పెట్రోల్ బంకుల్లో..

పెట్రోల్ బంకుల్లో..

గత ఏడాది అక్టోబర్ తరువాత పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ను సరఫరా చేసే ఆయిల్ కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని, వాటిని చెల్లించకపోవడం వల్ల ఇంధన సరఫరాను నియంత్రించాయని అన్నారు. ఫలితంగా దేశంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అడుగంటాయని వివరించారు.

కిరోసిన్ కూడా..

కిరోసిన్ కూడా..

పెట్రోల్, డీజిల్ లభించని పరిస్థితి తలెత్తిందని, దీన్ని నివారించడానికి వాటి రేట్లను పెంచాల్సి వచ్చిందని ఇషాక్ దర్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ తో పాటు కిరోసిన్ రేట్లు కూడా పెరిగాయి. కిరోసిన్ లీటర్ ఒక్కింటికి 18 రూపాయలు మేర పెంచింది ప్రభుత్వం. ఫలితంగా దీని ధర రూ. 189.83 పైసలకు చేరింది. లీటర్ లైట్ పెట్రోల్ ధర 187 రూపాయలు పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+