ఏం రిపోర్టింగ్‌రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)
ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోతోంది. డెత్ మిస్టరీలు చేధించాల్సిన పోలీసులు సైతం చేయలేని ప్రయత్నాలు ఇటీవల కాలంలో రిపోర్టర్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. అదలావుంటే గాడిదల సంతతి పెరిగిపోతోందంటూ ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్.. గాడిద మీద ఎక్కి రిపోర్టింగ్ చేసిన తీరు, అది అతన్ని కిందపడేసిన వైనం ఇంకా జనాలు మరిచిపోలేదు. అయితే తాజాగా వరద ప్రవాహంలో నిల్చుని చేసిన రిపోర్టింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
లైవ్ రిపోర్టింగ్ పేరుతో పాకిస్థాన్ రిపోర్టర్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. రియల్టీ కనిపించాలనుకుంటారో ఏమోగానీ ప్రాణాలకు రిస్క్ తీసుకుని రిపోర్టింగ్ చేస్తుంటారు. అది కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా అక్కడి పంజాబ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో వరద నీటిలో మునిగి తేలుతూ ఓ రిపోర్టర్ చేసిన లైవ్ రిపోర్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Level of reporting pic.twitter.com/UFZ9lsQVbk
— Salman Qureshi (@Saad612011) July 27, 2019
అక్కడి వరద ప్రవాహంతో పాటు సింధు నది ఉదృతిని రిపోర్టింగ్ చేస్తున్న అజర్ హుస్సేన్ అనే జర్నలిస్ట్ వివరాలు తెలియజేస్తూ ఏకంగా నదిలోకి దిగాడు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది గ్రేట్ రిపోర్టింగ్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో అవసరమా అనవసరపు పైత్యం తప్ప అని కామెంటుతున్నారు. ఇలా వరద ప్రవాహంలోకి దిగి రిపోర్టింగ్ చేయాల్సిన సీన్ లేదంటూ ఇంకొందరు తలంటుతున్నారు.
Donkey business flourishing in Lahore and look at the way my old Freind Amin Hafeez reporting donkey business by risking his life pic.twitter.com/FHYuQrYOqP
— Hamid Mir (@HamidMirPAK) December 19, 2018
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications