ముంబై ఉగ్రదాడి సూత్రధారి సయీద్‌కు పాక్‌లో మరో షాక్
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదదుల నాలుగో జాబితాలో అతని పేరు చేరుస్తూ పంజాబ్ ప్రావిన్స్ నిర్ణయం తీసుకుంది.
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు షాక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) ఉగ్రవాదుల నాలుగో జాబితాలో అతని పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలనూ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా తెలిపింది.
నాలుగో జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని వెల్లడించింది. దానికితోడు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అడిగిన ప్రతీసారి కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కౌంటర్ టెర్రరిజం శాఖ(సీటీడీ) సయీద్ పేరును ఏటీఏ జాబితాలో చేర్చినట్లు తెలిపింది.
హఫీజ్‌తో పాటు మరో నలుగురు పేర్లను కూడా ఈ షెడ్యూల్‌లో చేర్చారు. హఫీజ్‌ను గత నెల 30న లాహోర్‌లో గృహ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దేశం విడిచి పారిపోకుండా అతడి పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలోనూ చేర్చారు.

ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశముందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్ సహా పలువురిని గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. వంద మృతికి కారణమైన ఇటీవలి దాడులు కూడా హఫీజ్‌పై చర్యలు తీసుకోవడానికి కారణమని అంటున్నారు.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications