భారత్‌లో విమాన ప్రమాదం.. పాకిస్థాన్ ప్రధాని షాకింగ్ ట్వీట్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Pakistan PM s Tweet on India Plane Crash Sparks Controversy Amid Tragedy

ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దీంతో ఎవర్నీ గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో ఇరు దేశాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదం ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో మృతులకు సానుభూతి తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా తాను బాధపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరోవైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కూడా విమాన ప్రమాదం ఘటనపై ట్వీట్ చేశారు. 'తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన సరిహద్దులను చెరిపి మానవత్వంతో ఆలోచించే విధంగా చేసింది. దేశ ప్రజలకు.. ప్రధాని మోదీకి సానుభూతి తెలియజేస్తున్నా. అని నవాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.

మరోవైపు విమాన ప్రమాదం ఘటనపై బ్లాక్ బాక్స్ లభించింది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత బ్లాక్ బాక్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక విమాన ప్రమాద కారణాలపై ఎన్ఐఏ సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+