ఐఎస్ఐస్ తో లింక్: పాక్ ప్రొఫెసర్ అరెస్టు

లాహోర్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నించాడని పాక్ అధికారులు అంటున్నారు.

పాకిస్థాన్ లోని పంజాబ్ లోని యూనివర్శిటీ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న గలీబ్ ఆటా (48)ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. గలీబ్ ఆటా మీద వచ్చిన ఆరోపణలకు సాక్షాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

గలీబ్ కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో లింక్ ఉందని అధికారులకు సమాచారం అందింది. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గలీబ్ మీద ప్రత్యేక నిఘా వేశారు. కచ్చితమైన వివరాలు సేకరించి అతని ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేశారు.

Pakistan Professor arrested on suspicion of links with ISIS

గత వారంలో ఉగ్రవాద నేత హిజ్బుత్ తహరీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. హిజ్బుత్ తో గలీబ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. అంతే కాకుండ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో లింక్ ఉన్న విషయం బయటపడింది.

అందుకే ఆలస్యం చెయ్యకుండా తాము గలీబ్ ను అరెస్టు చేశామని పాక్ అధికారులు అంటున్నారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడని, ఎవ్వరికి తెలియకుండానే ఉగ్రవాద సమావేశాలకు హాజరైనాడని గలీబ్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+