తెగబడిన పాకిస్తాన్: బీఎస్ఎఫ్ క్యాంప్ మీద కాల్పులు

జమ్మూ: పాకిస్టాన్ మరోసారి తెగబడింది. పాక్ బలగాలు భారత్ సైన్యం సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఉన్నట్టుండి భారత్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. భారత్ బలగాలు సరైన సమాధానం చెప్పే సమయానికి పాక్ సైన్యం కనుమరుగైంది.

జమ్మూ కాశ్మీర్ లోని కతువ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇక్కడ హీరా నగర్ సెక్టార్ దగ్గర కరోల్ కృష్ణ బోర్డర్ ఔట్ పోస్టు ఉంది. ఈ ఔట్ పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్ బలగాలు నిత్యం 24 గంటలు గస్తి తిరుగుతుంటాయి. బుధవారం రాత్రి 6.30 గంటల సమయంలో పాక్ బలగాలు ఔట్ పోస్ట్ సమీపంలోకి వచ్చారు.

Pakistan Rangers resorted to unprovoked firing on the Border

తరువాత కరోల్ కృష్ణ బోర్డర్ ఔట్ పోస్టు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అదే సమయంలో బీఎస్ఎఫ్ బలగాలు ప్రతిదాడులుకు దిగడానికి సిద్దం అయ్యారు. అయితే పాక్ బలగాలు అప్పటికే కాలికి బుద్ది చెప్పారు. విషయం తెలుసుకున్న సీరియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పాక్ బలగాలు ఆటోమాటిక్ వెపన్స్ తో కరోల్ కృష్ణ బోర్డర్ ఔట్ పోస్టు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు అన్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ అధికారులు బీఎస్ఎఫ్ అధికారులతో చర్చించారు. పాక్ ఈ సారి కవ్వింపు చర్యలకు పాల్పడితే సరైన బుద్ది చెప్పాలని బీఎస్ఎఫ్ అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+