చైనా సహా బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు, 'ఎవరికీ తలవంచమని నిరూపించిన మోడీ'
చైనా వేదికగా జరిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సులో ఆ ఐదు దేశాలు ఉగ్రవాదంపై చర్చించాయి.
లాహోర్: చైనా వేదికగా జరిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సులో ఆ ఐదు దేశాలు ఉగ్రవాదంపై చర్చించాయి.
చదవండి: అణు యుద్ధం.. అది ఉత్తరకొరియా సత్తా, మాకంటే బెస్ట్, పరిజ్ఞానం ఇవ్వలేదు: పాక్ శాస్త్రవేత్త
ఆసియాలో తీవ్ర సమస్యగా మారిన తాలిబాన్, ఐసిస్, అల్ ఖైదా, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలను అణచివేయాలని బ్రిక్స్ సదస్సులో సోమవారం ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు
మోడీ పిలుపుకు మిగతా నాలుగు దేశాల అగ్రనేతలు సానుకూలంగా స్పందించారు. ఇది పాకిస్థాన్‌కు మింగుడు పడడం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈ ఐదు దేశాలపై పాకిస్థాన్ భగ్గుమంది.

బ్రిక్స్ తప్పుడు ఆరోపణలు
తమ దేశంపై బ్రిక్స్ దేశాల అగ్రనేతలు తప్పుడు ఆరోపణలు చేశారని పాకిస్థాన్ పేర్కొంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ మాట్లాడారు. తమదేశం ఉగ్రవాదులను అణచివేస్తోందని, ఉగ్ర సంస్థలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. తమ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం కాదన్నారు.

మోడీ ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచారు
ప్రపంచ దేశాల్లో భారత స్థాయిని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పెంచిందని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కర్ణాటకలోని మాందలోని ఓ కాలేజీలో దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి స్మారక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎవరికీ తలవంచమని మోడీ...
ఈ సందర్భంగా మాట్లాడారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో భారత్ ఎవరికీ తలవంచదని, ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం మరోసారి (డోక్లాం విషయంలో) చాటి చెప్పిందని భాగవత్ చెప్పారు. అలాగే దేశంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గొప్ప నిర్ణయమన్నారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని పెంచాయన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications