వయా శ్రీలంక..: భారత్‌పై పాక్ మరో దుష్ట పన్నాగం

న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్ర మరొకటి బయట పడింది. భారత్ పైకి ఉసిగొల్పేందుకు శ్రీలంకలోని ముస్లీంలను కూడా పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చాలా ఏళ్లుగా ఉపయోగించుకుంటున్నట్లు తేలింది.

శ్రీలంక దినపత్రిక సిలోన్ టుడేలో ఇందుకు సంబంధించి కథనం వ్చచింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా, దాని దాతృత్వ సంస్థ ఇదర ఖిడ్మతే ఖల్క్ (ఐకేకే)లను ఐఎస్ఐ ఇందుకోసం ఉపయోగించుకుంటోంది. 2004లో సునామీ తర్వాత లష్కరే-ఐకిక్ ఉగ్రవాదులను శ్రీలంకలో గుర్తించారు.

pakistan's nefarious designs exposed yet again; report says ISI radicalising Sri Lankan Muslims to target India

సునామీ తర్వాత సచ్ఛంద కార్యకర్తల పేరుతో శ్రీలంక, మాల్దీవుల్లో అడుగుపెట్టిన వీరు జిహాదీలను రిక్రూట్ చేసే పనిలో పడ్డారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎందరో యువకులు పాకిస్థాన్‌లోని లష్కరే తాయిబా ఉగ్రస్థావరాలు, ఖైబర్ పంక్తుంఖ్వాలోని గిరిజన ప్రాంతాలకు తరలివెళ్లారు.

భారత్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకే ఐఎస్ఐ శ్రీలంకను ఉపయోగించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. దక్షిణాదిన దాడులకు తెగబడడంతోపాటు యువకులను చేర్చుకునేందుకు కూడా ఉపయోగించుకుంటోంది.

శ్రీలంకలోని ముస్లిం ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్‌ను పెంచిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయాద్, అబ్దుల్ రమమాన్ మక్కికి అత్యంత సన్నిహితుడైన మౌలానా ఉమర్ మదానీ కార్యకలాపాలను జూన్, 2009లో శ్రీలంకలో గుర్తించారు. అంతకు ముందే మదానీ భారత్‌లో పట్టుబడ్డాడు. 2014లో అరెస్టు అయిన షకీర్ హుస్సేన్ కూడా విచారణలో షాకింగ్ వాస్తవాలు వెల్లడించాడు.

చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయిల్ కాన్సులేట్‌ను పేల్చాలని ఐఎస్ఐ ప్రణాళిక రచించినట్టు చెప్పాడు. అతని వద్ద లభించిన పాకిస్థాన్ వీసా శ్రీలంక నుంచి పొందినది. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా తెచ్చేందుకు కూడా ఐఎస్ఐ శ్రీలంకను ఉపయోగించుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+