రెండు రైళ్లు ఢీ: 16మంది మృతి, 40మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గడాఫీ ప్రాంతంలో వెళ్తున్న జకారియా ఎక్స్‌ప్రెస్‌కు తప్పుడు సిగ్నల్ రావడంతో ఎదురుగా వస్తున్న ఫరీద్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదం కారణంగా కరాచీ నుంచి మిగతా మార్గాల్లో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రైళ్ల మధ్యలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications