టీవి లైవ్ షో లో రెచ్చిపోయిన గెస్టులు.. కుస్తీని తలపించిన ఫైటింగ్ (వీడియో)

ఇస్లామాబాద్‌ : ఇద్దరు నేతల ముష్టియుద్దం వైరల్‌గా మారింది. టీవి లైవ్ షో లో ఉన్నామనే ఇంగీత జ్ఞానం మరచిపోయి ఆ ఇద్దరూ రెచ్చిపోయారు. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దాంతో డిస్కషన్ ఎపిసోడ్ కాస్తా రెజ్లింగ్ మ్యాచ్‌ను తలపించింది.

పాకిస్తాన్‌లో ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ రచ్చగా మారింది. ఆ షో లో పాల్గొన్న ఇద్దరు నేతలు లైవ్ షో అనే విషయం మరచిపోయి పంతాలకు పోయారు. ప్రత్యక్ష ప్రసారం అవుతుందనే విషయం మరిచిపోయి ఇరువురు ఘర్షణకు దిగారు. దాంతో లైవ్ డిబేట్ కాస్తా పిడిగుద్దులకు వేదికైంది.

Pakistan TV debate turns violent after PTI leader attacks panellist

ఆ ఛానల్ నిర్వహించిన న్యూస్‌ లైన్‌ విత్‌ అఫ్తాబ్‌ ముఘేరి డిబెట్‌ షోకు అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) కి చెందిన నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే చర్చా సందర్భంగా ఈ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది.

ఇంతియాజ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ధోరణితో మాట్లాడటం మసూర్ అలీకి నచ్చలేదు. దాంతో అతడిపై చేయి చేసుకున్నాడు. అయితే ఇంతియాజ్ కూడా అంతే వేగంగా రియాక్ట్ కావడం.. మసూర్ అలీపై దాడి చేయడం చకచకా జరిగిపోయాయి. ఇరువురి ఘర్షణతో లైవ్ డిబేట్ కాస్తా రసాభాసగా మారింది. వెంటనే ప్రోగ్రామ్ యాంకర్, ప్రొడ్యూసర్, సిబ్బంది కలుగజేసుకుని వారిద్దరినీ శాంతింపజేశారు.

అయితే మసూర్ అలీ ఎప్పటిలాగే తన సీట్లో కూర్చోగా.. ఇంతియాజ్ మాత్రం అక్కడినుంచి నిష్క్రమించారు. అంత పెద్ద రాద్దాంతం జరిగినా కూడా సదరు ఛానల్ లైవ్ షో ను కంటిన్యూ చేసింది. అయితే పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్.. దాడి చేయడమే నయా పాకిస్తాన్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+