దైవదూషణ: ప్రతిగా చేతిని నరికిచ్చిన బాలుడు

లాహోర్: దైవదూషణకు పాల్పడ్డానని అనుకుని 15 ఏళ్ల బాలుడు తన చేతిని తానే నరుక్కున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌కు 125 కిలోమీటర్ల దూరంలోని ముఖీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసు చీఫ్ నౌషర్ అహ్మద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గ్రామంలోని మసీదులో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో ఎవరో ఆపమని అరచినట్లుగా వినిపించిందనీ, ఎవరు అరిచారో చెప్పాలంటూ ఇమామ్ అడిగారు. దీంతో ఈ 15 ఏళ్ల మహమ్మద్ అన్వర్ తన చేతిని పైకెత్తాడు. దీంతో మసీదులో ఉన్న ప్రజలు అన్వర్ దైవదూషనకు పాల్పడ్డావని కోపగించుకున్నారు.

Pakistani boy cuts off own hand after blasphemy mistake: police

దీంతో అన్వర్ వెంటనే ఇంటికి వెళ్లి తన చేతిని నరుక్కుని ప్లేట్‌లో పెట్టి ఇమామ్‌కు అప్పగించాడని పోలీసులు తెలిపారు. తాను దైవదూషణకు పాల్పడ్డాననీ, దానికి పశ్చాత్తాపంగానే ఈ పని చేశానని ఆ యువకుడు ఇమామ్‌తో చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఈ ఘటన గురించి ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా దైవదూషణ అనేది పాకిస్థాన్‌లో క్షమించరాని నేరంగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+