‘పాక్ వెపన్’ నీలికళ్ల చాయ్‌వాలా.. మోడల్‌గా మారాడు!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన అర్షద్ ఖాన్ అనే నీలికళ్ల చాయ్‌వాలాను ఇప్పటికే సోషల్ మీడియాలో పాకిస్థాన్ వెపన్ అని, భారత అమ్మాయిలపై ఇతను సర్జికల్ దాడులు జరుపుతాడని పాక్ నెటిజన్లు హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అతనికి ఎక్కడా లేని ప్రచారం జరిగింది.

చాయ్ దుకాణం నడిపే అతను సోషల్ మీడియా పుణ్యమా అని పాకిస్థాన్‌లో టాప్ ట్రెండ్స్‌లో చేరిపోయాడు. దీంతో అనేక మంది అమ్మాయిలు అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. అతని అందాన్ని పొగుడుతూ చాలా కామెంట్లే చేస్తున్నారు.

ఈ పరిణామాలు అతని జీవితమే మారిపోయేలా చేశాయి. ఏకంగా ఓ మోడలింగ్ ఏజెన్సీతో అర్షద్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీంతో 'ఫిటిన్.పీకే' అనే ఫ్యాషన్ బ్రాండ్‌కి మోడల్‌గా వ్యవహరించబోతున్నాడు. కాగా, ఇప్పుడు సూటూ బూటు వేసుకున్న అతని ఫొటో మరింత వైరల్ అవుతోంది.

Pakistani 'chai wala' turns model

చాయ్‌వాలా నుంచి మోడల్ అయిపోయారంటూ సోషల్ మీడియాలో మరోసారి హల్‌చల్ చేస్తున్నాడు. ఇస్లామాబాద్‌కు చెందిన జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ ఓసారి అర్షద్ చాయ్ దుకాణంలో ఉండగా ఫొటో తీసింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో అతను మోడల్‌గా మారిపోయాడు.

ఇది ఇలా ఉండగా, అనుకోకుండా ఇంత ప్రచారం జరిగి, మోడల్‌గా అవకాశం రావడం పట్ల అర్షద్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాలని అభిమానులు కోరుతున్నారని, దీంతో తన మోడలింగ్ ఫొటోలు కూడా పోస్ట్ చేశానని తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+