పాకిస్తాన్ రిపోర్టర్లా, మజాకా?.. ఆనాడు గాడిద.. ఈనాడు వరద (వీడియో)

ఇస్లామాబాద్‌ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోతుండటంతో రిపోర్టింగ్ కూడా అలానే తయారైంది. డెత్ మిస్టరీలు చేధించాల్సిన పోలీసులు సైతం చేయలేని ప్రయత్నాలు ఇటీవల కాలంలో రిపోర్టర్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. అదలావుంటే గాడిదల సంతతి పెరిగిపోతోందంటూ ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్.. గాడిద మీద ఎక్కి రిపోర్టింగ్ చేసిన తీరు, అది అతన్ని కిందపడేసిన వైనం ఇంకా జనాలు మరిచిపోలేదు. అయితే తాజాగా వరద ప్రవాహంలో నిల్చుని చేసిన రిపోర్టింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

వరద తీవ్రత గురించి చెప్పాలంటే ఎక్కడినుంచైనా రిపోర్టింగ్ చేయొచ్చు. కానీ ఓ పాకిస్తాన్ రిపోర్టర్ మాత్రం వరద ప్రవాహంలోకి దిగి రిపోర్టింగ్ చేయడం.. అది కాస్తా ట్విట్టర్ వేదికకు చేరడం వైరలయింది. ఈ వీడియో చూసి కొందరు నెటిజన్లు నవ్వుకుంటే.. మరికొందరేమో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

 Pakistani journo gets into flooded river for report

నైలా ఇనయత్ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏ ఇతర ఛానెల్ చేయని స్టోరీ కావాలని ప్రొడ్యూసర్ అడగడంతో ఆ రిపోర్టర్ ఇలా చేశాడమో అంటూ క్యాప్షన్ పెట్టారు. దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంటుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+