భారత యువతికి ఉద్యోగమని చెప్పి బెడ్రూంలోకి తీసుకెళ్లిన పాక్ మేనేజర్!

యూఏఈ: భారత్‌కు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో పాకిస్తాన్‌కు చెందిన మేనేజర్ ఒకరు వేధించిన సంఘటన యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగింది. అవసరాన్ని ఆసరాగా తీసుకొని పందొమ్మిదేళ్ల ఆ యువతి పైన అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దుబాయ్‌లోని రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్తాన్ మేనేజర్ ఉన్నాడు.

Pakistani manager molests Indian woman jobseeker in UAE

గృహిణిగా పని చేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ ఉద్యోగం కావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఓ ఫోన్ కాల్ ద్వారా ఆమెతో సదరు పాకిస్తాన్ మేనేజర్ మాట్లాడాడు. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని చెప్పాడు.

ఇంటర్వ్యూకు రమ్మన్నాడు. అక్కడే కంప్యూటర్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆమె అతను చెప్పిన అడ్రస్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక అది ఆఫీస్ కాదని తెలిసింది. అది అతడి ఇల్లు. ఆమెకు ఏవో మాటలు చెప్పి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 26న ఈ కేసుపై తీర్పు వెలువడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+