నా కొడుకును కాల్చి పారేయండి: పాక్ మోడల్ తండ్రి
లాహోర్: తన కూతురును చంపిన తన తనయుడిని కాల్చి పారేయండని పాకిస్తాన్ మోడల్ కండీల్ బలోచ్ తండ్రి అన్వర్ అజమ్ వ్యాఖ్యానించాడు.
పరువు పేరుతో తన కూతురును చంపిన కొడుకు వసీం కనిపిస్తే వెంటనే చంపేయండన్నారు. తన కూతురును గొంతు నులిమి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన రోజు తాము ఇంటి పైన అంతస్తులో ఉన్నామని చెప్పారు. తమకు డ్రగ్స్ ఇవ్వడం వల్ల స్పృహ లేకుండా పడుకున్నామన్నారు. బలోచ్‌కు కూడా స్పృహ లేని పరిస్థితిలో ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉంటాడన్నారు.

కండీల్ బలోచ్
కండీల్ బలోచట్ తల్లి కూడా హత్య పైన ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ముమ్మాటికి తప్పు చేశాడన్నారు. తనతో కూతురు అన్ని విషయాలు చెప్పేదన్నారు.

కండీల్ బలోచ్
ఆ రోజు రాత్రి పాలు తాగి పడుకున్నామన్నారు. అయితే అందులో కొడుకు మత్తు మంది కలిపినట్లుగా తర్వాత అర్థమైందన్నారు.

కండీల్ బలోచ్
ఉదయం మత్తు నుంచి తేరుకుని లేచామని కండీల్ బలోచ్‌ను బ్రేక్ ఫాస్ట్ కోసం లేపబోతే లేవలేదన్నారు. ముఖం అంతా కమిలిపోయి ఉందని, నాలుక, పెదవులు నల్లగా అయిపోయి ఉన్నాయన్నారు.

కండీల్ బలోచ్
పాకిస్థాన్‌లో పరువు హత్యలు తరచూ జరుగుతుంటాయి. అయితే కుటుంబ సభ్యులు నిందితుడిని క్షమిస్తే శిక్ష తప్పించుకునే అవకాశముంది.

కండీల్ బలోచ్
బలోచ్ కేసులో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండడానికి అక్కడి అధికారులు బలోచ్ తల్లిదండ్రులు తమ కుమారుడిని క్షమించడానికి వీల్లేదని ఆదేశించారు.

కండీల్ బలోచ్
కాగా, పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ, మోడల్ కండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు వసీం సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి తమ పరువు తీస్తోందని హత్య చేసిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications