పాక్ గాయని పైత్యం: మోడీని చంపడానికి పాములు, మొసళ్ళు పంపుతోందట(వీడియో)
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయమే అయినప్పటికీ.. ఆ రాష్ట్రంలో అశాంతిని కోరుకునే పాకిస్థాన్‌కు మాత్రం కళ్లమంట ఆగడం లేదు. పాక్ ప్రధానితోపాటు ఆ దేశంలోని కొందరు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

పాక్ గాయని పైత్యం..
తాజాగా, ఓ పాకిస్థాన్ గాయని కూడా తన పైత్యాన్ని ప్రదర్శించింది. రబీ ఫిర్జదా అనే పాక్ గాయని.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ గిఫ్టు పంపుతానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ గిఫ్టుతో ఇక భారత్‌కు ప్రధాని ఉండడంటూ వ్యాఖ్యానించింది.

చంపుతానంటూ..
పాములు, మోసళ్లతోపాటు తాను ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది దాయాది దేశ గాయని. వీటన్నింటిని భారత ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇస్తా.. చచ్చి నరకానికి పోయేందుకు సిద్ధంగా ఉండంటూ తన అక్కసును వెళ్లగక్కింది.
బుద్ధి చెబుతున్న భారత నెటిజన్లు..
ఇంకా తనను తాను కాశ్మీరీ యువతి పేర్కొన్న సదరు గాయని.. తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో మాత్రం తాను పాకిస్థానీ పాప్ సింగర్ అని చెప్పుకోవడం గమనార్హం. దీంతో భారత నెటిజన్లు ఆమెకు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. మీ పాకిస్థానీలు ఇక మారరా? అంటూ విమర్శిస్తున్నారు. మీకు చంపడాలు తప్ప మరేం తెలియదా? అంటూ మండిపడుతున్నారు.
మోడీ చిన్నప్పుడే..
నీకైమైనా పిచ్చి లేచిందా? అంటూ విరుచుకుపడుతున్నారు. మీరు పంపే జంతువులు ఇక్కడికి వచ్చి సాదు జీవాలుగా మారిపోతాయని, ఎందుకంటే వాటి దేవుళ్లు ఇక్కడే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. మోడీ చిన్నప్పుడే పాములతో ఆడుకున్నాడు.. ఇవో లెక్కా అంటూ మరో నెటిజన్ ఓ వీడియో పోస్టు చేశారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications