ట్రెండ్ సెట్టర్‌గా భారత ప్రధాని..! మోదీజీ మీరు గ్రేట్..!! థ్యాంక్స్ చెప్పిన పాక్, బంగ్లా దేశీయులు.. ఎందుకంటే??
ఉక్రెయిన్‌పై గత 14 రోజులుగా రష్యా దళాలు బాంబులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో అనేక మంది మృతి చెందారు. భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్ వాసులతో పాటు విదేశీయులు బతుకుతున్నాయి. విదేశీ పౌరులు, విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాంబుల దాడుల్లో విదేశీ విధ్యార్థులు సైతం మృతి చెందారు.
ఆపరేషన్ గంగా ద్వారా విద్యార్థుల తరలింపు
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం వాతావరణం నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి వేల సంఖ్యలో భారత్ పౌరులను, విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చింది. రాజధాని కీవ్, సుమీ, ఖార్కివ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైత్యం విద్యార్థులను తరలించింది. అంతే కాదు కేవలం భారతీయులనే కాదు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కు చెందిన వారిని కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకువచ్చింది. వారు ఇక్కడ నుంచి తమ స్వదేశాలకు వెళ్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన 9 మంది ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశానికి వచ్చి తమ దేశానికి చేరుకున్నారు.
ప్రధాని మోదీకి పాక్ విద్యార్థి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ వాసులు ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు రణపడి ఉన్నామని దన్యావాదాలు తెలిపారు. తాజాగా ఉక్రెయిన్ లోని కీవ్ నుంచి భారత రాయబార కార్యాలయం సహకారంతో బయటపడిన పాకిస్థాన్‌కు చెందిన విద్యార్థి వీడియో వైరల్ అవుతోంది. పాక్ విద్యార్థి ఆస్మా షఫీక్ భారత రాయబార కార్యాలయానికి, ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్‌లో తాను అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని .. ఆ సమయంలో వాటి నుంచి బయటపడేందుకు తనకు ఇండియన్ ఎంబసీ సాయం చేసిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తనకు అన్నివిధాలు సాయం చేశారని తెలిపింది. ఇందుకు భారత్‌కు తాను ఎంతో రుణపడి ఉన్నానంటూ .. భారత రాయబార కార్యాలయానికి, ప్రధాని మోదీకి ఆస్మా కృతజ్ఞతలు తెలిపారు..
Recommended Video

మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని కృతజ్ఞతలు
అటు భారత్ ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా తరలించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమీలో చిక్కుకుపోయిని 694 భారత విద్యార్థులతో పాటు నేపాల్, ట్యునిషియా, పాక్ , బంగ్లాదేశ్ పౌరులను కూడా ఆపరేషన్ గంగా ద్వారా వాళ్లను పోల్తావాకి 12 బస్సుల్లో తీసుకువచ్చారు. సరిహద్దు దేశాల నుంచి వారిని ప్రత్యేక విమానాల్లో భారత్ తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం అపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుక్కున్న తమను స్వదేశానికి తీసుకురావడం పట్ల విద్యార్థులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications