అక్కతో అక్రమ సంబంధం : గుట్టు రట్టవడమే కాదు, ప్రాణాలే..

Subscribe to Oneindia Telugu

ముల్తాన్ : గుట్టు చప్పుడు కాకుండా నడిపిద్దామని చూసిన వ్యవహారం కాస్త బెడిసికొట్టింది. ఇంట్లో వాళ్లకు తెలియొద్దనుకున్నారు గానీ వ్యవహారం బెడిసికొట్టి ఏకంగా ప్రియుడి ప్రాణాలే హరించడంతో వార్త కాస్త పతాక శీర్షికల్లోకి ఎక్కినంత పనైపోయింది. పాకిస్థాన్ లోని ముజఫర్ గఢ్ లో శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. పాకిస్తాన్ లో ఓ అక్రమ సంబంధం ప్రియుడి ప్రాణాలను హరించింది. వావి వరుసలను సైతం పక్కనబెట్టి వరుసకు సోదరుడయ్యే ముష్తాక్‌ అహ్మద్‌ బలూచ్‌(22) అనే వ్యక్తితో రాణీ బీబీ అనే ఇద్దరు పిల్లల తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త ఇంటికి దూరంగా ఉంటుండడంతో వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తోంది.

Pakistani woman hides lover in trunk, suffocates him

అయితే రాణీ బీబీ ఉంటున్నది ఉమ్మడి కుటుంబం కావడంతో, ఇద్దరూ తరుచుగా కలుసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత రాణీ దగ్గరకు రావడం, ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నాడు ముష్తాక్ అహ్మద్.

ఇదే క్రమంలో.. శనివారం నాడు అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు అహ్మద్. అయితే రాణీ బీబీ గదిలోకి ప్రవేశించగానే ఇంట్టో వాళ్ల అలికిడి మొదలవడంతో, ప్రియుడు అహ్మద్ ను గదిలోని ట్రంకు పెట్టెలో దాచింది ప్రియురాలు రాణీ బీబీ.

అయితే అనుమానంతో బీబీ గదిలోకి వచ్చిన కుటుంబ సభ్యులు రాణీ బీబీ గదిని పరిశీలించి వెళ్లిపోయారు. ఆ సమయంలో 'తనకు ఊపిరాడట్లేదంటూ..' ప్రియుడు అహ్మద్ ట్రంక్ పెట్టెలోంచి అరిచే ప్రయత్నం చేసినా.. అతడి అరుపులు వాళ్లకు వినపడలేదు. దీంతో దాదాపు 15 నిముషాల పాటు ట్రంకు పెట్టెలోనే కొట్టుమిట్టాడి ఊపిరాడక మృతి చెందాడు అహ్మద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Pakistani woman who was having an affair with her cousin accidently suffocated him in a trunk after hiding him there when other relatives woke up late at night, police said Sunday.Married father Mushtaq Ahmed Baloch, 22, was having an affair with his cousin Rani Bibi, a mother of two, and came to her house at night while her family was sleeping, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి