రోగం వస్తే మెడిసిన్ లేదు కానీ .. యుద్ధం కావాలా నాయనా!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం తప్పదా అన్న విధంగా ఇరుదేశాలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఉగ్రవాదులను , వారికి మద్దుతు ఇస్తున్న వారికి గుణపాఠం తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. సిందు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాక్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఇండియాలో ఉన్న ఆ దేశ పౌరులు వెళ్లిపోయాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది.
అయితే ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో పాటు ఆకలి కేకలతో అలమటిస్తున్న పాక్ పరిస్థితి మరింత దిగజారనుంది. వాణిజ్య సంబంధాల నిలిపివేత పరిణామం పాకిస్తాన్‌లోని ఔషధ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. తమ దేశంలో ఔషధాల కొరత రాకుండా చూసేందుకు పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు 'అత్యవసర సన్నద్ధత' చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. ఇప్పటికే సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ కు ఔషద సరఫరా నిలపివేస్తే చావు కేకలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

భారత్ నుండి దిగుమతి..
ప్రస్తుతం, పాకిస్తాన్ తన మొత్తం ఔషధ అవసరాలలో ముఖ్యంగా ముడి పదార్థాలు ( యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ ) అనేక కీలకమైన పూర్తిస్థాయి ఔషధ ఉత్పత్తుల కోసం భారతదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దాదాపు 30 శాతం నుండి 40 శాతం వరకు ముడి పదార్థాలు భారతదేశం నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటితో పాటు, ప్రాణాధారమైన వ్యాక్సిన్లు, ముఖ్యంగా యాంటీ-రేబీస్ వ్యాక్సిన్, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి కీలకమైన జీవసంబంధ ఉత్పత్తులు కూడా భారతదేశం నుంచే పాకిస్తాన్‌కు చేరుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు అంతంత మార్గమే.
డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ (DRAP) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. నిషేధంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదని, అయితే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆకస్మిక ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. 2019లో తలెత్తిన సంక్షోభం తర్వాతే తాము ఇలాంటి పరిస్థితులకు సన్నద్ధమవడం ప్రారంభించామని, ఇప్పుడు తమ ఔషధ అవసరాలను తీర్చడానికి చైనా, రష్యా, పలు యూరోపియన్ దేశాల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను చురుకుగా అన్వేషిస్తున్నామని ఒక సీనియర్ DRAP అధికారి పేర్కొన్నారు. యాంటీ-రేబీస్ వ్యాక్సిన్లు, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి ప్రాణాధారమైన వైద్య సామాగ్రి నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ కొరత తప్పదా?
డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ సన్నద్ధత కొంత వరకు ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ, పరిశ్రమ నిపుణులు , ఆరోగ్య రంగ ప్రముఖులు పరిస్థితి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య నిషేధం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని తక్షణమే పరిష్కరించకపోతే, దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. 'పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో సుమారు 40 శాతం మేర భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలు, జీవసంబంధ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు , సెరా, ప్రత్యేకించి యాంటీ-రేబీస్ వ్యాక్సిన్ , యాంటీ-స్నేక్ వెనమ్ వంటివి భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటాము' అని పాకిస్తాన్ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి తెలిపారు.
ప్రభుత్వం అన్ని రకాల వాణిజ్యాన్ని నిషేధిస్తున్నట్లు సాధారణ ప్రకటన చేసినప్పటికీ, ఔషధ రంగానికి మినహాయింపు ఉందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. సరఫరాలో అంతరాయం ఏర్పడితే కీలకమైన కొరత ఏర్పడుతుందని ఔషధ రంగం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ పరిస్థితికి బ్లాక్ మార్కెట్ ఉనికి మరింత పెంచే అవకాశం ఉందని పాక్ ఆరోగ్య ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్ , తూర్పు సరిహద్దుల గుండా నమోదుకాని, ఆమోదం లేని మందులు, అక్రమంగా పాకిస్తాన్‌లోకి రవాణా అవుతున్నాయి. చట్టబద్ధమైన దిగుమతుల వల్ల ఏర్పడిన ఖాళీలను ఈ మార్గాలు కొంత వరకు పూరిస్తున్నప్పటికీ, వీటి నాణ్యతకు లేదా స్థిరమైన సరఫరాకు ఎటువంటి హామీ లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
ఔషద సంక్షోభం తప్పదా..
ఈ నేపథ్యంలో, ఔషధ రంగ ప్రతినిధులు రంగంలోకి దిగారు. పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PPMA) చైర్మన్ తౌఖీర్-ఉల్-హక్ నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లి వాణిజ్య నిషేధం నుండి తమ రంగాన్ని మినహాయించాలని కోరుతూ ప్రభుత్వ అధికారులను కలిసింది. భారతదేశం నుండి ప్రత్యేకంగా ముడి పదార్థాలు వచ్చే అనేక ప్రాణాధారమైన ఉత్పత్తులు ఉన్నందున, ఈ నిషేధం నుండి ఔషధ రంగాన్ని మినహాయించాలని కోరింది. రోగుల జీవితాలను రక్షించడానికి ఔషధ , ఆరోగ్య సంబంధిత వాణిజ్యాన్ని నిషేధం నుండి మినహాయించాలని PPMA ప్రతినిధి బృందం స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (SIFC)ని కూడా అభ్యర్థించింది.
మొత్తమ్మీద, భారత్-పాక్ మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభన పాకిస్తాన్ ఔషధ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తక్షణ చర్యలు తీసుకోకపోతే దేశంలో ప్రాణాధార మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి...
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications