చైనా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే భారత్ పై దాడులు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు సంబంధించిన పూర్తి మిలిటరీ సమాచారాన్ని చైనా.. పాకిస్థాన్ కు చేరవేసిందని ఆయన కుండ బద్దలు కొట్టారు.

చైనా, భారత్ మధ్య ఏటా కొన్ని మిలిటరీ, వైమానిక, నేవీ విన్యాసాలు జరుగుతుంటాయి. ఇతర దేశాలు నిర్వహించే వైమానిక విన్యాసాల్లోనూ అనేకసార్లు చైనా, భారత్ కలిసి పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఒక దేశం ఆయధ సంపత్తి మరొక దేశానికి తెలిసే అవకాశం ఉంది. అయితే భారత్ తో చైనా నిర్వహించిన పలు విన్యాసాల్లో భారత్ ఆయుధ సంపత్తికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చైనా సేకరించి ఆ డేటాను పాకిస్థాన్ కు చేరవేసిందని పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan s Khawaja Asif Claims Chinese Satellite Intel Fueled Attacks on India

చైనా ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంతో తాము ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకున్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఖవాజా పేర్కొన్నారు. పాక్ లోని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. యుద్ధం సమయంలో చైనా ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే భారత్ పై దాడులు చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ వినియోగిస్తున్న ఆయుధాల వివరాలను చైనా తమకు అందించిందన్నారు.

చైనాతో పాకిస్థాన్ కు వ్యూహాత్మక ఒప్పందాలు ఉన్నాయని వాటిలో భాగంగానే తమ దేశానికి చైనా సపోర్ట్ చేసిందని పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సాయంతోనే భారత్ పై అలుపెరగకుండా దాడులు చేశామని ఖవాజా పేర్కొన్నారు. చైనా, పాకిస్థాన్ మధ్య వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా శాటిలైట్ చిత్రాలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామని ఖవాజా స్పష్టం చేశారు.

పాకిస్థాన్ లాగానే చైనా కు కూడా భారత్ తో సరిహద్దు వివాదాలు, భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ఖవాజా తెలిపారు. ఈ కారణంతోనే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+