ఎంతకు తెగించార్రా.. పాక్ తో అమెరికా సీక్రెట్ ఒప్పందం.. భారత్ అలర్ట్
అమెరికా, పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గతంలో అంతంతమాత్రంగానే ఉండేవి. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాకు పాకిస్థాన్ దగ్గరవుతూ వస్తోంది. ఇటీవల అమెరికా ఆర్మీ పరేడ్ లో పాక్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం.. అమెరికాకు పాకిస్థాన్ అరుదైన ఖనిజాలను సరఫరా చేసింది. ఒప్పందంలో భాగంగా పాక్ నుంచి అమెరికాకు తొలి నమూనాల కన్సైన్ మెంట్ చేరింది. దీన్ని ఇరు దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంగా నిపుణులు పరిగణిస్తున్నారు. అరుదైన ఖనిజాల తవ్వకాలు, సరఫరా దృష్ట్యా పాకిస్థాన్ లో 500 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి అమెరికా సంస్థ సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు అరుదైన ఖనిజాల ఎగుమతి కోసం పాకిస్థాన్, అమెరికా మధ్య కీలక ఒప్పందంపై పాకిస్థాన్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రహస్య ఒప్పందంపై దేశ ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ డీల్.. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే రహస్య ఒప్పందం అని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
ఇక ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ లో జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ లోని రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్ ను అన్వేషించడం, వాటిని తవ్వి వెలికితీయడం, ప్రాసెసింగ్ చేయడం తదితర అంశాలకు అనుగుణంగా అమెరికన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని చారిత్రక ఒప్పందం అని నిపుణులు భావిస్తున్నారు. కానీ పాకిస్థాన్ లో ఈ ఒప్పందంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది ఒక రహస్య ఒప్పందం అని దీని పూర్తి వివరాలను దేశ ప్రజల ముందు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డీల్ ప్రకారం పాకిస్థాన్ ఖనిజ సంపద అగ్రరాజ్యానికి తరలిపోతుందని మండిపడుతున్నాయి.

ఇక ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక రేర్ ఎర్త్ మినరల్స్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీటిని సమీకరించేందుకు ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ తో గతనెలలో డీల్ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ 500 మిలియన్ డాలర్లుగా ఉంది. జాతీయ భద్రత, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్ డ్ మానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో క్రిటికల్ మినరల్స్ ఎంతో ఉపయోగకరం అని గతంలోనే ట్రంప్ అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు సాయం చేయాలంటే ఈ అరుదైన ఖనిజాలు అవసరం అని ట్రంప్ ఇదివరకే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్- అమెరికా రహస్య ఒప్పందంపై భారత్ అలెర్ట్ గా ఉంది. ఇరు దేశాల కదలికలను నిశితంగా గమనిస్తోంది.












Click it and Unblock the Notifications