ట్రాంప్‌కు షాక్.. స్కాంట్లాండ్‌లోని గోల్ఫ్ రిసార్టుపై దాడి! హెచ్చరిక
గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు తీవ్ర నిరసనలకు దిగుతున్నారు. గాజా పౌరులను వేరేచోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామిన ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పాలస్తీనీయన్లతోపాటు పశ్చిమాసియా దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనను వ్యతిరేకిస్తూ స్కాట్లాండ్‌లోని ఆయన గోల్ఫ్ రిసార్టుల్లో ఒకదానిపై పాలస్తీనా మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. 'గాజా అమ్మకానికి లేదు' అంటూ అక్కడ ప్రాంగణంలో పెద్ద అక్షరాలతో రాతలు రాశారు. ఈ వ్యవహరాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు. గోల్ఫ్ కోర్స్ కు నష్టం జరిగిందని నివేదిక అందిందని, దీనిపై విచారణ కొనసాగుతోందని స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు.

మరోవైపు స్కాట్లాండ్‌లోని టర్న్ బెర్రీ గోల్ఫ్ కోర్సు, హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పాలస్తీనా యాక్షన్ టీం నిరసనకారులు ప్రకటించారు. గాజాను తన సొంత ఆస్తిా భావిస్తూ.. దాని విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానని ట్రంప్ పేర్కొనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమ చర్యల ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేయడంతోపాటు ఆయన సొంత ఆస్తి కూడా సురక్షితం కాదని చాటి చెప్పామన్నారు.
BREAKING: Palestine Action wreck Trump's golf course in Turnberry, Scotland.
— Palestine Action (@Pal_action) March 8, 2025
"GAZA IS NOT FOR SALE" is sprayed across the lawn and the golf course's holes are dug up.
Whilst Trump attempts to treat Gaza as his property, he should know his own property is within reach. pic.twitter.com/ZoH8joHEYi
కాగా, బ్రిటీష్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ వేదికల్లో ఒకటైన టర్న్ బెర్రీని డొనాల్డ్ ట్రంప్.. 2014లో కొనుగోలు చేసి, అభివృద్ధి చేశారు. అయితే అప్పట్నుంచి అక్కడ ఎలాంటి గోల్ఫ్ పోటీలు నిర్వహించలేదు.
Trump Turnberry vandalized overnight.
— Molly Ploofkins (@Mollyploofkins) March 8, 2025
"GAZA IS NOT FOR SALE" is sprayed across the lawn and the golf course's holes are dug up. pic.twitter.com/LC2Df5VvDl
గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పాలస్తీనీయులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే.. గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాకు సంబంధించి ఓ ఏఐ వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అయితే, హామాస్ మాత్రం ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించింది. కొనుగోలు చేసి, అమ్మడానికి గాజా స్థిరాస్థి కాదని.. అది తమ పాలస్తీనాలో విడదీయలేని భాగమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications