భూకంప బీభత్సం. సునామీ ముప్పు? 7.7 తీవ్రతతో వణికిపోయిన దేశం!

పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశమైన పనామాలో పెను భూకంపం బీభత్సం సృష్టించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏకంగా 7.7గా నమోదైంది. ఈ భారీ ప్రకంపనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టంపై అధికారికంగా ఎటువంటి వివరాలు వెలువడనప్పటికీ, ఈ ప్రాకృతిక విపత్తు దేశాన్ని కుదిపేసింది.

గగనతలానికి అందిన భయం.. భవనాల నుంచి బయటకు పరుగులు!

పనామాలోని పసిఫిక్ తీర ప్రాంతమైన సెంట్రల్ హేరెరా ప్రావిన్స్‌లోని పితలోజా అరిబాకు పశ్చిమ-నైరుతి దిశలో 12 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి సరిగ్గా ఈ విపత్తు సంభవించింది. తొలుత దీని తీవ్రతను 8.0గా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత దానిని 7.7కి సవరించారు. భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలో ఎత్తైన స్కై స్క్రాపర్స్ ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

Panama Hit by 7 7 Magnitude Earthquake President Inspects Damage as Tsunami Warnings Are Cancelled

డజన్లకు పైగా ఆఫ్టర్‌ షాక్స్.. నిలిచిపోయిన విమాన, మెట్రో సర్వీసులు!

మొదటి భారీ భూకంపం తర్వాత దేశంలో డజన్లకు పైగా ఆఫ్టర్‌షాక్స్ నమోదైనట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో కార్యాలయం వెల్లడించింది. భద్రతా చర్యల్లో భాగంగా పనామా మెట్రో రైలు సేవలను తక్షణమే నిలిపివేశారు. అలాగే, టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేసి, కొన్ని విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు కొ్న్ని ప్రాంతాలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

అర్ధరాత్రి భూకంపం.. 30 కిలోమీటర్ల లోతులో కంపించిన నేల!
అర్ధరాత్రి భూకంపం.. 30 కిలోమీటర్ల లోతులో కంపించిన నేల!

తప్పిన సునామీ ప్రమాదం.. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధ్యక్షుడు!

ఈ భారీ భూకంపం కారణంగా మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీవ్ర కలకలం రేగింది. కోస్టారికా, ఎల్ సాల్వడార్, పెరు, మెక్సికో, గ్వాటెమాలా, నికరాగ్వా, కొలంబియా, ఈక్వెడార్ దేశాల తీర ప్రాంతాలను సునామీ ముప్పు పొంచివున్నట్లు హెచ్చరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఈ సునామీ హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉండే 'రింగ్ ఆఫ్ ఫైర్' బెల్ట్‌లో పనామా ఉండటం వల్లనే తరచూ ఇక్కడ ఇలాంటి భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.

విరుచుకుపడ్డ డబుల్ భూకంపం! సునామీ భయం, 47 మంది మృతి
విరుచుకుపడ్డ డబుల్ భూకంపం! సునామీ భయం, 47 మంది మృతి

తీవ్రంగా దెబ్బతిన్న ప్రావిన్సులు.. సహాయక చర్యలపై సర్కార్ దృష్టి!

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కొక్లే ప్రావిన్స్‌లోని పెనోనోమే జిల్లాలో పర్యటించిన ఆయన, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇది నిజంగా పెద్ద విపత్తు అని పేర్కొన్నారు. హేరెరా, కొక్లే, లోస్ శాంటోస్ ప్రావిన్సులు ఈ భూకంపం వల్ల ఎక్కువగా నష్టపోయాయని ఆరోగ్య మంత్రి ఫెర్నాండో బోయిడ్ తెలిపారు. ముఖ్యంగా లోస్ శాంటోస్‌లోని టోనోసి ప్రాంతం మిగతా ప్రదేశాలతో సంబంధాలు కోల్పోవడంతో, అక్కడికి కేవలం హెలికాప్టర్ల ద్వారానే సహాయక సామగ్రిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ ఏడాది 7.0 తీవ్రతకు మించి భూకంపాలు సంభవించడం ఇది నాల్గవసారి కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+