నాసాకు ఎదురుదెబ్బ: 'ప్లయింగ్ సాసర్' ప్రయోగం విఫలం(వీడియో)
న్యూఢిల్లీ: ప్లయింగ్ సాసర్ టెక్నాలజీని పరీక్షించి అంగారకుడిపైకి మానవులను పంపాలని నాసా చేపట్టిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయాన్ని స్వయంగా నాసానే వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎల్‌డీఎస్‌డీ(లో డెన్సిటీ సూపర్ సోనిక్ డిసిలిలేటర్) పేరుతో తయారు చేసిన ఫ్లయింగ్ సాసర్ ప్రయోగం విఫలమైందని నాసా పేర్కొంది. బెలూన్ ద్వారా 1.2 లక్షల అడుగుల ఎత్తునకు ప్లయింగ్ సాసర్‌ను పంపించి, ఆ ఎత్తులో రాకెట్లను మండించి విజయవంతంగా కిందకు దింపాలన్నది తమ లక్ష్యమని తెలిపింది.
అయితే దురదుష్టశాత్తూ ఈ ప్రయోగం విఫలమైందని వెల్లడించింది. విఫలమవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, మరోసారి ఈ ప్రయోగం చేయనున్నట్లు వివరించింది. కాగా, హవాయి ద్వీపంలో ఇదే తరహా పరీక్షను జూన్ 2014లో జరిపింది.
LDSD team reports good inflation of Mars test craft’s decelerator ring, but parachute failed. http://t.co/QKmrLyVB6b pic.twitter.com/7IaSivL5QF
— Spaceflight Now (@SpaceflightNow) June 8, 2015 











Click it and Unblock the Notifications