ఛీ! అరెస్ట్ చేయండి: పారిస్ దాడి నిందితుడి సోదరుడు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ దాడులకు కారణమైన తన సోదరుడిని అరెస్టు చేయాలని మహ్మద్ అబ్దెస్లామ్ డిమాండ్ చేశాడు. తన ఇద్దరు సోదరులు చేసిన పని కారణంగా తమ కుటుంబం మొత్తం తలెత్తుకోలేకుండా ఉందని తెలిపాడు.

దాడులకు కొన్ని రోజుల ముందు తన ఇద్దరు సోదరులను చూశానని అబ్డెస్లామ్ చెప్పాడు. పారిస్ దాడుల బాధితుల ఆవేదన తనకు తెలుసని పేర్కొన్నాడు. తాము కూడా చాలా బాధపడుతున్నామన్నాడు. పారిస్ మారణహోమానికి మహ్మద్ అబ్దెస్లామ్ సోదరులు బ్రహీమ్ అబ్దెస్లామ్, సలాహ్ అబ్దెస్లామ్ కారకులు.
ఫ్రాన్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బ్రహీమ్ అబ్దెస్లామ్ చనిపోయాడు. సాలాహా అబ్దెస్లామ్ పరారయ్యాడు. సాలాహాను తక్షణం అరెస్టు చేయాలని మహ్మద్ అబ్డెస్లామ్ కోరాడు. లేదా సలాహ్ వెంటనే సరెండర్ కావాలని సూచించాడు.












Click it and Unblock the Notifications