ఐసిస్‌కు మరో దెబ్బ: ప్యారిస్ దాడుల నేత హతం

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ టెర్రర్ దాడి నాయకుడిని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అమెరికా విమాన దాడిలో ప్యారిస్ దాడుల అతను మృతి చెందినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలు తెలిపింది. అతను సిరియాలో హతమయ్యాడని తెలిపింది.

ఇరాక్‌ నగరం రమాదీ పైన ఇస్లామిక్ స్టేట్ పట్టు కోల్పోయింది. ఇటీవలే దాని మీద అది పట్టుకోల్పోయింది. రమాదీ పైన తమ పట్టు సడలిపోయిందనే విషయాన్ని ఉగ్రవాద సంస్థ ఐసిస్ జీర్ణించుకునే లోపే ఈ రూపంలో మరో దెబ్బ తగిలింది.

పదిమంది ఐసిస్ నాయకులను మట్టుపెట్టినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. మృతి చెందిన వారిలో ప్యారిస్‌ ఘాతుకానికి ఒడిగట్టిన వారు కూడా ఉన్నారని వెల్లడించాయి.

Paris terror leader killed by US as he plotted new attacks

రమాదీలో ఇరాక్‌ ప్రధాని హైదెర్‌ అల్ అబాదీ తమ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. తమ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా గురువారం దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నామని, వేడుకలు నిర్వహిస్తామన్నారు. తమ తదుపరి లక్ష్యం బాగ్ధాద్‌కు 400 కి.మీ. దూరంలోని మోసుల్‌ అని చెప్పారు. ఆ నగరాన్ని సైతం ఐసిస్ చెర నుంచి విడిపిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+