ఆత్మాహుతి దాడికి యత్నం: నకిలీ గర్భవతి అరెస్టు

ప్యారిస్: తనకు గర్భం ఉందని నమ్మిస్తూ ఆత్మాహుతి దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఓ మహిళతో పాటు ఆమె భర్తను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అరెస్టు అయిన మహిళ, ఆమె భర్త పేరు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.

ఫ్రాన్స్ కు చెందిన (23) మహిళ ఇస్లాం మతంలోకి మారింది. ఈమె భర్త (35)తో కలిసి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్నది. ఈ దంపతుల మీద అనుమానం రావడంతో పోలీసులు నిఘా వేశారు. వీరి ఇంటి మీద దాడులు చేశారు. తరువాత ఆమె గర్భవతి కాదని పోలీసులు గుర్తించారు.

కడుపు ఎత్తుగా ఉండేందుకు ఆమె ఓ దిండు కొనుగోలు చేసిందని పోలీసులు గుర్తించారు. ఆ దిండును ఆ దంపతులు ఇంటర్నెట్ లో కొనుగోలు చేశారని పోలీసులు చెప్పారు. విమానాల్లో ప్రయాణించే సమయంలో మంచి సౌకర్యాలు ఉంటాయని తాము నకిలీ గర్భాన్ని కొనుగోలు చేశామని వాళ్లు వాదిస్తున్నారు.

 Paris terror police have arrested a woman, planning suicide bombing ?

అయితే ఆ దిండు మీద అల్యూమినియం ఫాయిల్ కోటింగ్ ఉందని, మెటల్ డిటెక్టర్ల నుంచి కూడా లోపల ఉన్న పదార్థాలు స్కాన్ కాకుండ అది అడ్డుకుంటుందని పోలీసులు చెప్పారు. ఇలాంటివి కేవలం బాంబులు దాచడానికి ఉపయోగిస్తారని పోలీసులు అన్నారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సాగించిన అరాచకాల వీడియోలను ఆ దంపతులు చూశారని తమ దగ్గర సాక్షాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దంపతులను ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.

2015 నవంబర్ 13వ తేదిన ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 130 మంది మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్రాన్స్ పోలీసులు అనుమానితుల మీద నిఘా వేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+