పార్కింగ్ చేసిన కారులో సెక్స్: కదిలి నదిలో పడిపోయిన కారు, మహిళ మృతి

మాస్కో: రష్యాలో ఓ దంపతుల విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. రష్యాలోని కుబర్ నది వద్దకు పిక్నిక్ వెళ్లిని ఇద్దరు దంపతులు పార్కింగ్ చేసిన తమ కారులో శృంగారం చేసుకుంటున్నారు. అదే సమయంలో సరిగా పార్కింగ్ చేయకపోవడంతో ఆ కారు కదిలి నేరుగా వెళ్లి నదిలో పడిపోయింది.

లైఫ్‌న్యూస్.ఆర్‌యు కథనం ప్రకారం.. వాజ్-2115(రష్యాలో పేరుపొందిన (లాడా సమారా) కారు) ఆ దంపతులు సెక్స్ చేసుకుంటుండగా కదిలిపోయి నదిలో పడిపోయింది. హ్యాండ్‌బ్రేక్ కూడా సరిగా వేయకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Parked car rolls into river with couple having sex inside; woman dies

కాగా, నదిలో పడిపోగానే కారులోని వ్యక్తి తలుపు బద్దలుకొట్టి బయటికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే 35ఏళ్ల మహిళ మాత్రం కారులోనే ఉండిపోయి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరూ కూడా అతిగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, కారును, అందులోని మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు. ఘటన స్థలంలో పెద్ద సంఖ్యలో మందు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+