వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరం చేస్తే, చిలుకనైనా అరెస్ట్ చేస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది !

|
Google Oneindia TeluguNews

తాము పట్టుకోవాలనుకున్న నేరస్థులకు సహకరించినందుకు గాను అసలు నేరస్థులను వదిలిపెట్టి, వారికి సహకరించిన చిలుకను అరెస్ట్ చేశారు బ్రెజిల్ పోలీసులు, దీంతో పంజరంలో ఉండాల్సిన చిలక పెద్ద ఊచల మధ్య జైల్లో ఉంది.

 బ్రెజిల్ లో చిలుకకు జైలు శిక్ష !

బ్రెజిల్ లో చిలుకకు జైలు శిక్ష !

నేరం చేస్తే మనుషులైనా, పక్షులైన సమానామే అంటున్నారు బ్రెజిల్ పోలీసులు. చాల రోజులుగా బ్రెజిల్ లో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి పోలీసులు. ఈనేపథ్యంలోనే పోలీసులకు...స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అచూకి లభించింది. ఆచూకి లభించిన ముఠా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తుండడతో పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఓ ఇంట్లో ఉన్న స్మగ్లర్లను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. గుట్టుచప్పుడు కాకుండా ముఠా ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం ముఠాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మామా పోలీస్, చిలుక అలర్ట్

మామా పోలీస్, చిలుక అలర్ట్

అయితే ముఠాను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు మాత్రం ఆ ఇంటిముందు ఉన్న చిలకను గమనించలేదు. కాని పోలీసుల రాకను పసిగట్టే ట్రైనింగ్ తీసుకున్న చిలుక మాత్రం పోలీసుల రాకను గమనించింది. దీంతో "మామా పోలీస్ " అంటూ అరిచిదంట, వెంటనే గమనించిన స్మగ్లర్లు మరో మార్గం గుండా పారిపోయారు. ఇంకేముంది లోపలకు వెళ్లిన పోలీస్ లకు నిరాశ ఎదురైంది. చిలుక అరవడం వల్లే నేరస్థులు పారిపోయారని భావించిన పోలీసులు నేరస్థులకు సహకరించిందన్న అభియోగం క్రింద చిలుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

చిలుకను విచారించిన పోలీసులు , నోరు విప్పని చిలుక

చిలుకను విచారించిన పోలీసులు , నోరు విప్పని చిలుక

చిలుకను వదిలిపెట్టాలంటూ పర్యావరణవాదుల ఆందోళన ,

అయితే అరెస్ట్ అనంతరం చిలుకను విచారణ చేపట్టారు.కాని పోలీసుల విచారణ లో చిలుక మాత్రం నోరు విప్పలేదట, ఇక మరోవైపు చిలుకను వదిలిపెట్టాలంటూ పర్యావరణవేత్తల నుండి డిమాండ్ లు రావడంతో చేసేదేమి లేక చివరకు చిలుకను జూ కు అప్పగించారు.చిలకు మూడు నెలల పాటు ఎగరడానికి ట్రైనింగ్ ఇచ్చి బయటకు వదలి పెడతారట,

గతంలో కూడ ఇలాంటీ సంఘటనలు బ్రెజిల్ దేశంలో ,

గతంలో కూడ ఇలాంటీ సంఘటనలు బ్రెజిల్ దేశంలో ,


కాగా బ్రెజిల్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ముఠాలు జంతువులను వినియోగించుకోవడం బాగా పెరిగిపోయింది. కాని ఈ తరహ పక్షులను ఊపయోగించుకోవడం మాత్రం మొదటి సారని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ చిలుకకు ట్రైనింగ్ సైతం ఇచ్చారని పోలీసులు భావిస్తున్నారు.కాగా ఇలాంటీ ఘటనే కొలంబియాలో తన యజమానిపై ఇంటి రైడ్ చేయడంతో చిలుక రన్ రన్ అంటూ సంకేతాలించింది.

English summary
A parrot was taken into custody Monday after nearly spoiling a raid while playing lookout for two crack-dealing suspects by repeatedly yelling, "Mamae, policia!" according to Brazilian police in the state of Piaui. The phrase means, "Mama, police!"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X