ఉబెర్ డ్రైవర్ 'ఒలింపిక్' కోరిక నెరవేర్చిన ప్యాసింజర్

పెన్సిల్వేన్వియా : కొడుకు ఒలింపిక్స్ లో పాల్గొనబోతుంటే.. ప్రత్యక్షంగా చూడలేకపోతున్నానన్న బాధలో ఉన్న ఓ తండ్రి కోరికను నెరవేర్చింది ఓ మహిళ. గంటపాటు జరిగిన ఓ ప్రయాణంలో డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంభాషణ.. ఆ తండ్రి కోరిక నెరవేరేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాలో ఉబెర్ డ్రైవర్ గా పనిచేస్తోన్న ఎలిస్ హిల్ ఒకరోజు మహిళా ప్యాసింజర్ అయిన లిజ్ విలియంను క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. పెన్సిల్వేనియా ఫిలడేల్ఫియా ల మద్య గంటపాటు జరిగిన ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణ కొనసాగింది.

Passenger helps Uber driver go to Rio Olympics to watch son compete

ఇదే క్రమంలో.. హిల్ గురించి లిజ్ విల్లాక్ ఆరా తీయడం మొదలుపెట్టడంతో.. తన గురించి మొత్తం వివరించాడు హిల్. తన కొడుకు డారెన్ హిల్ అమెరికా తరుపున షాట్ పుట్ విభాగంలో పాల్గొనబోతున్నాడని.. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా.. కొడుకు ప్రతిభను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు.

అతని పరిస్థితి విని చలించిపోయిన లిజ్.. అతని కలను ఎలాగైనా నెరవేర్చాలని భావించింది. అనంతరం ఇద్దరు తమ నంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక హిల్ ను ఒలింపిక్ విలేజ్ రియో డీ జెనీరో కు పంపించడమే టార్గెట్ గా గో ఫండ్ మి అనే ప్రచారం నిర్వహించిన లిజ్, 7500 డాలర్లను కూడగట్టింది. దీంతో వచ్చిన మొత్తాన్ని ఎయిర్ టికెట్స్.. మిగతా ఖర్చుల కోసం అతనికి పంపించింది.

లిజ్ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది స్పందించడంతో.. రెండు రోజుల్లోనే అనుకున్న మొత్తాన్ని పోగు చేయగలిగింది లిజ్. ఏదేమైనా మొత్తానికి ఓ ప్యాసింజర్ చేసిన సహాయంతో ఇప్పుడా తండ్రి ఒలింపిక్ విలేజ్ లో అడుగుపెట్టబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+