ఆకాశంలో విమానం డోర్ తెరిచే యత్నం, ముచ్చెమటలు
కాలిఫోర్నియా: విమాన ప్రయాణంలో ఓ ప్రయాణీకుడు విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించడం గందరగోళానికి దారి తీసింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఆకాశంలో వెళ్తున్న విమానంలో తలుపు తెరిచే ప్రయత్నాలు చేయడంతో సహచర ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి!
విమానం తలుపు తెరిచే ప్రయత్నం చేయగా కొందరు అతడిని బలవంతంగా అదుపు చేసి నియంత్రించారు. చికాగో నుంచి శాక్రమెంటో వెళుతున్న విమానంలో ఇది జరిగింది.

ప్రయాణికుడి చర్యతో విమానాన్ని ఒమాహాకు మళ్లించి విమానాశ్రయంలో దించేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత విమానం తిరిగి గమ్యస్థానానికి బయల్దేరి వెళ్లింది.
ఆ విమానం సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం. విమానంలో ఘటన జరిగిన సమయంలో 134 మంది ప్రయాణీకులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
అతను తలుపు తీసే ప్రయత్నం చేయడంతో తాము ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యామని ప్రయాణీకులు చెబుతున్నారు. ఆ వ్యక్తిని ఇద్దరు తోటి ప్రయాణీకులు, ఓ డాక్టర్ నిలువరించారు. ఈ ఉదంతంతో విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుకుంది.












Click it and Unblock the Notifications