వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కో ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం: ఫ్లైట్స్ ఆలస్యం

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్‌లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

విమానాశ్రయంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాక ప్రయాణికులను తిరిగి ఎయిర్ పోర్టులోకి అనుమతిస్తామని అత్యవసర విభాగం అధికారులు ప్రకటించారు.

Passengers Evacuated, Flights Delayed By Fire at Moscow Airport

బేరింగ్ సముద్ర జలాల్లో చైనా మిలటరీ

వాషింగ్టన్: బేరింగ్ సముద్ర జలాల్లో చైనా మిలటరీ నౌకలు సంచరిస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చెప్పింది. చైనాకు చెందిన ఐదు మిలటరీ నౌకలు రష్యా, అలస్కాల మధ్య గల సముద్ర జలాల్లో తిరిగినట్లు తాము గుర్తించామని పెంటగాన్ పేర్కొంది.

చైనా నౌకలు బేరింగ్ జలాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటి సారని, తన సముద్ర జలాలను దాటి అంతర్జాతీయ ప్రభావం చూపడానికి చైనా ప్రయత్నిస్తోందనడానికి ఇది నిదర్శనమని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాల నౌకలకు స్వేచ్ఛగా తిరగాడే హక్కు ఉంటుందని, దాన్ని తాము గౌరవిస్తామని పెంటగాన్ అధికార ప్రతినిధి బిల్ ఉర్బన్ చెప్పారు. చైనా నౌకలు బేరింగ్ జలాల్లో సంచరించడాన్ని తాము గుర్తించటం ఇదే మొదటిసారని ఆయన తెలపారు.

English summary
Moscow's main international airport was briefly evacuated Thursday morning, and around 40 flights delayed, after a fire broke out in the baggage handling area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X