విండోస్ లేని విమానాలు! స్నాప్‌డీల్‌లో జపాన్ కంపెనీ
లండన్: కిటికీలు లేని విమానం లండన్‌లో టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి విమానాన్ని బ్రిటన్‌కు చెందిన విమాన కంపెనీలు తయారు చేశాయి. సాధారణ విమానాలకు ఉన్నట్లు దీనికి కిటికీలు ఉండవు. ఆకాశంలోకి విమానం ఎగిరినప్పుడు.. అక్కడి అందాలను చూపే కొన్ని చిత్రాలను చుట్టూ అమర్చారు.
విమానం బయట కెమెరాలను అమర్చారు. అవి తీసే ఫోటోలను లోపల సీట్ల ముందు ఉండే తెరల పైన కనిపించేలా చేశారు. వాటిని ప్రయాణీకులు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇష్టం లేనప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ విమానానికి టెస్ట్ రన్ నిర్వహిస్తారు.

కిటికీలు ఉంటే కిటీకీ పక్కనున్న ప్రయాణీకులే బయట దృశ్యాలను కొంత వరకు చూడవచ్చు. అయితే, ఈ కిటికీలు లేని విమానం ద్వారా ప్రయాణీకులు అందరు కూడా బయట దృశ్యాలను చూడవచ్చు. ప్రతి ఒక్కరు తమ తమ సీట్లలోనే కూర్చొని ఆస్వాదించవచ్చును. కాగా, ఈ విమానం తయారీ కోసం సెంటర్ ఫర్ ప్రాసెస్ ఇన్నోవేషన్ పరిశోధకులు, ఇంజనీర్లు పని చేశారు.
స్నాప్ డీల్‌లో జపాన్ కంపెనీ పెట్టుబడులు
దేశ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్.కామ్‌లో జపాన్‌కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థ సాప్ట్ బ్యాంక్ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.3,762 కోట్లు పెట్టుబడిగా రానున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది.
భారత్‌కు చెందిన ఓ ఆన్ లైన్ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మొబైల్ టెక్నాలజీ మార్కెట్ లో అడుగు పెట్టాలని కూడా భావిస్తున్నట్లు చెప్పింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications