క్రూయిజ్ బుక్ చేసుకున్న జంట, లోనికి వెళ్లగానే షాక్: గదిలో బెడ్‌పై యువతితో క్రూమెంబర్ సెక్స్
లండన్: హాలీ డే ట్రిప్ కోసం వెళ్లిన క్రూయిజ్ ప్రయాణీకులు.. క్రూయిజ్‌లోని తమ కేబిన్‌లోని బెడ్ పైన క్రూ మెంబర్.. ఓ యువతితో శృంగారంలో పాల్గొనడం చూసి షాకయ్యారు. ఈ షాకింగ్ సంఘటన బ్రిటిష్ జంట మేరీ, బాబీ జాక్సన్‌కు ఎదురైంది. వీరి షిప్‌లోకి ఎక్కి, కేబిన్‌లోకి వెళ్లి చూసి, నోరు వెళ్లబెట్టారు.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన రూంలో మహిళతో కేబిన్ క్రూ సెక్స్
ఈ సంఘటనపై మేరీ జాక్సన్ మాట్లాడుతూ... అక్కడి సంఘటన చూసి తాను ఆందోళన చెందానని చెప్పింది. తమ గదిలోని బెడ్డు పైన వారిని చూడగానే తనకు ఏమీ తోచలేదని చెప్పింది. తాము ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న గదిలో, కేబిన్ క్రూ చెందిన వ్యక్తి, మరో మహిళతో శృంగారంలో పాల్గొనడం చూసి ఆశ్చర్యపోయామని చెప్పింది.

వెంటనే డోర్ క్లోజ్ చేశాం
ఇది చూడగానే తాను వెంటనే డోర్ క్లోజ్ చేశానని ఆమె చెప్పింది. ఆ సమయంలో తమతో పాటు మరో కేబిన్ అటెండెంట్ కూడా ఉన్నారని చెప్పింది. దీనిని చూసిన అతను వెంటనే సూపర్ వైజర్‌కు విషయం చెప్పేందుకు వెళ్లాడని తెలిపింది.

చాలాసేపు వేచి చూశారు
అప్పటికే తాము షిప్ కోసం చాలాసేపు వేచి చూశామని, ఆ తర్వాత షిప్‌లోకి ఎక్కి వెంటనే డ్రింక్ కోసం బార్‌కు వెళ్లామని బాబీ చెప్పాడు. ఈ షిప్ కోసం వారు సింగపూర్‌లోని మెరినా బేలో దాదాపు రెండున్నర గంటల పాటు వేచి చూశారు. ఆ తర్వాత అది రాగానే ఎక్కారు. కానీ వారికి ఊహించని షాక్ తగిలింది.

డ్రీమ్ క్రూయిజ్ షిప్
కాగా, ఇది వారి డ్రీమ్ క్రూయిజ్. ఇందులో ప్రయాణించేందుకు వారు 4,800 పౌండ్లు ఖర్చు చేశారు. వెంటనే నార్వేజియన్ క్రూయిజన్ లైన్‌లో పెద్ద మొత్తం ఖర్చు చేసి థాయిలాండ్‌కు దీనిని బుక్ చేశారు. వారు తమ కోసం ఓ గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications