వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట దాడి: పాక్‌లో అరెస్టులు, ఆఫీసుల సీల్

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిందని భావిస్తు జైష్ ఎ మొహ్మద్ ఉగ్రవాద సంస్థపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలకు దిగింది. ముల్తాన్, బహవల్‌పూర్ సహా మొత్తం నాలుగు పట్టణాల్లోని మూడు కార్యాలయాలకు సీల్ వేశారు. బుధవారంనాడు 10 మందిని అరెస్ట్ చేశారు.

జైష్ ఎ మహ్మద్ కార్యాలయాలనుంచి అనుమానాస్పద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. మరింతమందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. భారత్ ఇచ్చిన ఆధారాలపై మరింత సమాచారం సేకరించి పాక్ అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.

 Pathankot attack: Pakistan arrests Jaish-e-Mohammad leaders, seals offices

మసూద్ అజర్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కార్యాలయాలను మూసేసినట్లు పాకిస్తాన్ మీడియా రాసింది. పఠాన్‌కోట దాడిపై దర్యాప్తు చేసేందుకు పాకిస్తాన్ అధికారులను భారత్ పంపించనుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులో పఠాన్‌కోట దాడికి బాధ్యులని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.

పాకిస్తాన్ తీసుకునే చర్యల కోసం నిరీక్షించాల్సి ఉందని ఆయన మంగళవారంనాడు చెప్పారు. సమర్థమైన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు కూడా తెలిపారు. చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని తాము పాకిస్తాన్ ప్రభుత్వానికి అందించినట్లు కూడా తెలిపింది.

English summary
Acting on leads provided by India, Pakistan on Wednesday arrested several members of terror outfit Jaish-e-Mohammad, which is suspected to be behind the attack on the Indian Air Force base in Pathankot earlier this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X