రోహిణిలోకి కుజుడు.. 4 రాశులకు 'కుబేర యోగం'
జ్యోతిష్య శాస్త్రంలో సాహసానికి, పరాక్రమానికి, ఆకస్మిక మార్పులకు కారకుడైన అంగారకుడు (కుజుడు) త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. 2026 జులై 12న కృత్తిక నక్షత్రం నుంచి బయలుదేరి భాగ్యప్రదాత అయిన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 12 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ నాలుగు నెలల కాలం కొన్ని రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఊహించని స్థాయిలో ధనలాభం కలగనుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
కుజుడి నక్షత్ర సంచారం వృశ్చిక రాశి వారికి ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కుదురుతాయి. కొత్త డీల్స్ ద్వారా లాభాలు రెట్టింపు అవుతాయి. కుటుంబంలో గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయి, బంధుత్వాలు మరింత బలపడతాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ మార్పు ఒక సరికొత్త టర్నింగ్ పాయింట్ కానుంది. ఉద్యోగ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో మీ ప్రతిభకు గుర్తింపుగా కొత్త బాధ్యతలు దక్కుతాయి. ప్రమోషన్లతో పాటు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఆత్మవిశ్వాసం పతాక స్థాయికి చేరుకుంటుంది.
మేష రాశి
మేష రాశి వారికి అంగారకుడి నక్షత్ర పరివర్తనం అద్భుతమైన యోగాన్ని తీసుకొస్తోంది. వీరిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఆదాయ మార్గాలు అద్భుతంగా మెరుగవుతాయి. అయితే, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త అవసరం. ఇళ్లలో శుభకార్యాలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం, ప్రశాంతత నెలకొనడం వంటి సానుకూల మార్పులు కనిపిస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సమయం 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పొచ్చు. అదృష్టం మీ తలుపు తడుతుంది. ఆఫీసుల్లో పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న వృత్తిపరమైన సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ కాలం చాలా అనుకూలమైనది. ఊహించని లాభాలు సొంతమవుతాయి.












Click it and Unblock the Notifications