టీడీపీ ఎంపీ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు ? స్వయంగా సోదరుడే..!

టీడీపీలో కలకలం. స్వయంగా పార్టీకి చెందిన ఓ తొలిసారి ఎంపీ (TDP MP) అవినీతిపై స్వయంగా ఆయన సోదరుడే ఈడీకి ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందులో సదరు ఎంపీ ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారో పూర్తిగా ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) కాగా.. ఫిర్యాదు చేసింది ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani). దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అలాగే ఫిర్యాదులో కేశినేని నాని పేర్కొన్న అంశాలపైనా చర్చ జరుగుతోంది.

కేశినేని చిన్ని అక్రమ నెట్‌వర్క్‌పై భారీ ఆరోపణలు చేస్తూ కేశినేని నాని ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేశినేని చిన్న, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజ్ కసిరెడ్డి, వారి నెట్‌వర్క్‌పై మనీలాండరింగ్ చట్టం కింద అత్యవసర విస్తృత దర్యాప్తు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగినా, జానకి లక్ష్మికి సమన్లు ఉన్నప్పటికీ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు.

TDP MP Kesineni Chinni Accused of Corruption in ED Complaint Filed by Brother Former MP Nani
కేశినేని నానికి ఎంపీ చిన్ని షాక్..! ఆదుకోని చంద్రబాబు పోస్ట్..!
కేశినేని నానికి ఎంపీ చిన్ని షాక్..! ఆదుకోని చంద్రబాబు పోస్ట్..!

అలాగే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ టికెట్ కోసం ₹5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు చేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ₹60 లక్షలు సుంకర రామచంద్ర రావు, ₹50 లక్షలు బొల్లినేని మోహన్ రావు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్లు జరిగిన దానిపై దర్యాప్తు చేయాలని నాని కోరారు. అలాగే కేశినేని డెవలపర్స్ దుండిగల్, కర్తానూర్-పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకరపల్లి ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచ్‌లో భారీ మొత్తాలు వసూలు చేసి రియల్ ఎస్టేట్ కస్టమర్లను మోసం చేశారని ఆరోపించారు. అలాగే సాహితి ఇన్‌ఫ్రా స్కామ్‌తో చిన్ని కనెక్షన్ మీద కూడా దృష్టి సారించాలని కోరారు.

బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!
బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!

112 ఎకరాల ప్రగతి నగర్ భూమి స్కామ్ పైనా ఆరోపణలు చేసారు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ (MP కుమారుడు వెంకట్ చౌదరి ద్వారా) భూమి ఈడీ అటాచ్‌మెంట్, ఎన్టీఎల్టీ, పీఎంసీ బ్యాంక్ కేసుల్లో ఉండగా ప్రీ-లాంచ్ సేల్స్ కొనసాగాయన్నారు. 112 ఎకరాల భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్‌లో ఈడీ అటాచ్‌మెంట్, ఎన్టీఎల్టీ, పీఎంసీ బ్యాంక్ విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచేసి సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. వీటితో పాటు అక్రమ గనులు , ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక, గ్రావెల్, ఫ్లై యాష్ గనులు, జూద దండాలు, ల్యాండ్ గ్రాబింగ్‌లో ఎంపీ నెట్‌వర్క్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే కేశినేని చిన్ని అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ఆరోపణలు, పర్సనల్ ఆడిటర్ దండమూడి శ్రీనివాస్ ట్రెజరర్‌గా ఉన్న ఏసీఏలో అవినీతి మీద కూడా దర్యాప్తు చేయాలని కోరారు.

TDP MP Kesineni Chinni Accused of Corruption in ED Complaint Filed by Brother Former MP Nani

గతేడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ స్కామ్ లో ₹70 నుంచి ₹500 కోట్ల వరకు బలవంతంగా వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంపీ, గుడివాడ ఎమ్మెల్యే రాము భాగస్వాములుగా ఉన్న అమెరికాకంపెనీ విద్యార్థులు, వలసదారుల్ని మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌పై పూర్తి దర్యాప్తు, ఆస్తులు అటాచ్‌మెంట్, నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఈడీని నాని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+