బ్రైయిన్ ఆపరేషన్ చేస్తుంటే గిటార్ వాయించాడు

షెన్ జన్: బ్రెయిన్ కు సర్జరీ చేస్తున్న సమయంలో రోగి హాయిగా గిటారు వాయించిన సంఘటన చైనాలో జరిగింది. ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన దక్షిణ చైనాలోని షెన్ జెన్ లో చోటు చేసుకుంది. వింతగా ఉన్న ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

దక్షిణ చైనాలోని షెన్ జెన్ లో నివాసం ఉంటున్న లీ జియాంగ్ (57) అనే వ్యక్తి మెదడు సమస్యతో బాధపడుతున్నాడు. దీనివల్ల అతని చేతివేళ్లపై మెదడు నియంత్రణను కొల్పోయాడు. వైద్యులు పరిక్షీంచి అతనికి బ్రైన్ సర్జరీ చెయ్యాలని నిర్ణయించారు.

Patient Plays Guitar during Brain Surgery in Southern China

అతని మెదడులో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రోడులను అమర్చడం ద్వారా అతన్ని తిరిగి మామూలుగా మార్చొచ్చని వైద్యులు భావించారు. సోమవారం ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో జియాంగ్ గిటార్ వాయించాడు.

గిటార్ వాయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వైద్యులు ఎలక్ట్రోడుల పనితీరును నిర్దారించుకుంటూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ సక్సస్ అయ్యింది. మెదడులో కొత్తగా అమర్చిన ఎలక్ట్రోడ్ లతో పదేళ్లపాటు జియాంగ్ తన వేళ్లపై నియంత్రణ కలిగి ఉంటాడని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+