ఉక్రెయిన్‌కు అమెరికా పేట్రియాట్ మిస్సైల్ సిస్టమ్.. రష్యాకు కష్టమే ఇక!

Patriot Missile System: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. అమెరికా ఉక్రెయిన్‌కు 'పేట్రియాట్' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పేట్రియాట్ వ్యవస్థను అందించేందుకు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ తరఫున అవసరమైన వ్యయాన్ని భరించే అవకాశం ఉందని సమాచారం. అమెరికాకు చెల్లించాల్సిన వ్యయాన్ని చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియన్ ప్రకటించారు. ఈ విషయంపై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌ను కలిసి చర్చించేందుకు ఆయన వాషింగ్టన్ వెళ్తున్నారు. రష్యా నుంచి వైమానిక దాడుల్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గత కొంత కాలంగా యూఎస్ నుంచి పేట్రియాట్ వ్యవస్థను కోరుతున్నారు.

పేట్రియాట్ వ్యవస్థ అంటే ఏమిటి?
పేట్రియాట్ అనేది అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వ్యవస్థ శత్రువుల నుంచి వచ్చే వైమానిక దాడులు, డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను, విమానాలను, డ్రోన్లను పేట్రియాట్ వ్యవస్థ రాడార్ సహాయంతో గుర్తించి వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. దీని పూర్తి పేరు Phased Array Tracking Radar to Intercept on Target (PATRIOT). దీనిని రేథియాన్ కంపెనీ తయారు చేసింది. ఇది మొదటిసారిగా 1980లలో మోహరించబడింది. ఈ క్షిపణి శక్తి ఇప్పుడు ఉక్రెయిన్‌కు మరోసారి లభిస్తోంది. ఈ వ్యవస్థలో భూమి నుంచి గాలిలోకి దూసుకెళ్లే ప్రత్యేక క్షిపణులు ఉంటాయి. పేట్రియాట్ వ్యవస్థను ప్రపంచంలో అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలో ఒకటిగా పరిగణిస్తారు. 'పేట్రియాట్' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఒక సాధారణ బ్యాటరీలో రాడార్, కంట్రోల్ సిస్టమ్, ఒక పవర్ యూనిట్, లాంచర్లు, సహాయక వాహనాలు ఉంటాయి.

Patriot Missile System to Ukraine A Major Turn in Russia-Ukraine War

ఈ పేట్రియాట్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
శత్రుదేశాల నుంచి వచ్చే విమానాలు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ మిస్సైళ్లతో సహా శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థ కలిగి ఉంది. చాలా కాలం నుంచి ఉన్న PAC-2 ఇంటర్ సెప్టర్లు లక్ష్యాన్నికి సమీపంలో పేలిపోయే బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ను కలిగి ఉండేవి. అయితే తాజాగా వచ్చిన పేట్రియాట్ PAC-3 మిస్సైళ్లు నేరుగా లక్ష్యాన్ని ఢీకొడతాయి. ఉక్రెయిన్ దేశానికి అందించే వ్యూహాత్మక పేట్రియాట్ వ్యవస్థలో PAC-3 సీఆర్ఐ ఇంటర్‌‌సెప్టర్ లను అందించే ఛాన్స్ ఉంది. పేట్రియాట్ వ్యవస్థ రాడార్ పరిధి 150 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు ఈ పేట్రియాట్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి. అందులో అమెరికా, జర్మనీ, పోలాండ్, ఉక్రెయిన్, జపాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి. జనవరిలో అమెరికా ఇజ్రాయెల్ నుంచి దాదాపు 90 పేట్రియాట్ ఇంటర్ సెప్టర్లను ఉక్రెయిన్ దేశానికి పంపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడుతూ.. తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చాలా నిరాశ చెందానని అన్నారు. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడటం ఆనందంగా ఉంటుందని, కానీ ఆ తర్వాత ఆయన తిరిగి ఉక్రెయిన్‌పై తీవ్ర బాంబు దాడిని ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపాలన్న ట్రంప్ నిర్ణయం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. ఆయన తన పదవీకాలం ప్రారంభ నెలల్లో పుతిన్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రతిసారీ ఆయనకు నిరాశే ఎదురైంది.ఇప్పుడు ట్రంప్ కొత్త విధానం కింద ఉక్రెయిన్‌కు కొత్త ఆయుధాలను పంపనున్నట్లు ప్రకటించారు. అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తుందని.. దీనికి నాటో దేశాలు చెల్లిస్తాయని ట్రంప్ అన్నారు. పరికరాల మొదటి విడతలో క్షిపణులతో సహా భారీ మొత్తంలో ఆయుధాలు పంపబడతాయని అన్నారు. పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలతో సహా ఉన్నత స్థాయి యుద్ధ సామగ్రి ఉక్రెయిన్‌కు చేరుకోనున్నాయని ట్రంప్ అన్నారు.

తగ్గిపోతున్న కాల్పుల విరమణ అవకాశం
ట్రంప్ ఉక్రెయిన్‌కు పేట్రియాట్ వ్యవస్థను ఇవ్వనున్నట్లు ప్రకటించడం మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో కాల్పుల విరమణ అవకాశాలను మసకబార్చింది. ఉక్రెయిన్ కాల్పుల విరమణ కోసం రష్యా షరతులను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాల్పుల విరమణ కోసం షరతులు విధించారు, అవి ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాలు, క్రిమియా నుండి సైనిక ఉపసంహరణ, నాటో నుండి దూరం, రష్యన్ భాష-సంస్కృతిని రక్షించడం. ఈ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ షరతులను తిరస్కరిస్తూ పూర్తి, షరతులు లేని కాల్పుల విరమణను డిమాండ్ చేశారు. అలాగే రష్యన్ సైనిక ఉపసంహరణ, యుద్ధ నేరాల దర్యాప్తును షరతుగా పెట్టారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 2025లో రష్యా, ఉక్రెయిన్ తక్షణ కాల్పుల విరమణ చర్చలను ప్రారంభిస్తాయని పేర్కొన్నారు, అయితే పుతిన్ గడువు ఇవ్వడానికి నిరాకరించారు. "యుద్ధ మూలాలను" పరిష్కరించడంపై దృష్టి సారించారు. జూలై 2025 నాటికి ఎటువంటి పురోగతి లేదని ట్రంప్ తరువాత అంగీకరించారు. రష్యా డిమాండ్లు ఉక్రెయిన్‌కు లొంగిపోవడంతో సమానం. రష్యా నిరంతర డ్రోన్ దాడులు, ఉక్రెయిన్ ప్రతిదాడులు ఉద్రిక్తతలను పెంచాయి. రెండు పక్షాల పరస్పర విరుద్ధమైన డిమాండ్లు, నమ్మకం లేకపోవడం వల్ల కాల్పుల విరమణ అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+