Modi: మోడీకి పాదాభివందనం చేయబోయిన పవువా న్యూ గినియా పీఎం..!
పసిఫిక్ ద్వీప దేశమైన పపువా న్యూ గినియాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. విమానాశ్రయంలో మోడీకి పవువా న్యూ గినియా పీఎం జేమ్స్ ఘనస్వాగతం పాలికారు. జేమ్స్ మరాపే మోడీ పాదాలను తకుతున్నట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు. పపువా న్యూ గినియా ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ పాదాలను తాకడం ద్వారా ఆయనకు ఘన స్వాగతం పలికారని ట్వీట్ చేశారు.
ఈ దృశ్యం ప్రధాని మోడి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి, ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌పిఐసి)లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ పవువా న్యూ గినియాకు వెళ్లారు. జేమ్స్ మరాపే 2019 నుంచి న్యా గినియా పీఎంగా కొనసాగుతున్నారు. ఆయన PANGU Pati రాజకీయ పార్టీకి చెందినవారు. జేమ్స్ మరాపే 1993లో యూనివర్శిటీ ఆఫ్ పపువా న్యూ గినియా నుంచి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ పట్ట పొందారు.

కాగా పవువా న్యూ గినియా అత్యున్నత పురస్కారంతో పాటు ఫిజీ అత్యన్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఫిజీ ప్రధాన మంత్రి సితివేణి రబుకా మోడీకి ప్రదానం చేశారు. ఇప్పటివరకు ఫిజీయేతరులైన అతికొద్ది మందికి మాత్రమే దీనిని అందుకొన్నారు. అనంతరం గినియా ప్రభుత్వం.. 'కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు'ను ఇచ్చి మోడీని గౌరవించింది.
గతంలో పలుదేశాలు మోడీకి అత్యున్నత పురస్కారాలను అందించాయి. అంతర్జాతీయ వేదికపై మోడీ నాయకత్వంతో భారత్‌కు పెరుగుతోన్న ప్రాబల్యం, ఇతర దేశాలతో మెరుగవుతున్న సంబంధాలకు గుర్తుగా ఈ గౌరవాలు దక్కుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి భారత్ తో పాటు 14 పసిఫిక్ ద్వీప దేశాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి మోడీ తన తొలి పర్యటన సందర్భంగా ఆదివారం పపువా న్యూ గినియాకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications