టెలిగ్రామ్ కు సంకటం- రష్యా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో.. !!

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు సంబంధించిన వివాదం అనూహ్య మలుపు తిరిగింది. రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆయనపై కఠిన చర్యలకు దిగింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో కేసు సైతం నమోదు చేసింది. ఆయనను అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇంటర్నెట్‌పై పూర్తి నియంత్రణ సాధించాలనే ప్రయత్నాల్లో భాగంగా ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.

టెలిగ్రామ్ వేదికగా రష్యా వ్యతిరేక శక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఎఫ్‌ఎస్‌బీ ఆరోపించింది. ఉక్రెయిన్ నిఘా సంస్థలు, ఇతర ఉగ్రవాద మూకలు తమ దేశ భూభాగంలో విద్రోహ చర్యలు చేపట్టడానికి, సైబర్ మోసాలకు పాల్పడటానికి టెలిగ్రామ్ లోని పలు ఛానళ్లు, చాట్‌లు, చాట్ బాట్లను చురుగ్గా ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. వీటి ద్వారా రష్యాలో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోందని, వీటిని తొలగించడంలో టెలిగ్రామ్ యాజమాన్యం విఫలమైందనీ ఆరోపించింది.

Pavel Durov charged with aiding terrorism as Russia adds Telegram founder to wanted list security

రష్యన్ క్రిమినల్ కోడ్ లోని ఆర్టికల్ 205.1 కింద దురోవ్‌పై అధికారులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం ఆయనపై మోపిన నేరాలు కోర్టులో నిరూపితమైతే దురోవ్‌కు రష్యాలో ఏకంగా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ హఠాత్ పరిణామంతో రష్యా ప్రభుత్వం, టెలిగ్రామ్ యాజమాన్యం మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న వివాదం మరో నూతన మలుపు తిరిగినట్టయింది.

ఈ ఆరోపణలను పావెల్ దురోవ్ ఖండించారు. ప్రజల వ్యక్తిగత గోప్యత, భావప్రకటన స్వేచ్ఛను కాలరాయడానికి రష్యా అధికార యంత్రాంగం భద్రతను ఓ సాకుగా చూపిస్తోందని విమర్శించారు. టెలిగ్రామ్ యాప్ వినియోగాన్ని పరిమితం చేయడానికే ఇటువంటి తప్పుడు కేసులను సృష్టిస్తోందని విమర్శించింది. పావెల్ దురోవ్.. స్వదేశం రష్యా. ఆయన అక్కడే పుట్టారు. స్వదేశంలో ఆంక్షలు తీవ్రతరం కావడంతో విదేశాలకు వలస వెళ్లారు.

రష్యా ప్రభుత్వం కొంతకాలంగా ఇంటర్నెట్ వినియోగంపై కఠినమైన నిబంధనలను మోపుతోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ లను పూర్తిగా నిషేధించింది. వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్‌లపై కూడా పలు ఆంక్షలు అమలులో ఉన్నాయి. వీటి స్థానంలో ప్రభుత్వం మాక్స్ అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను రక్షణ సంస్థలకు అందిస్తుందనే విమర్శలు ఉన్నాయి.

పావెల్ దురోవ్ రష్యాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చట్టపర సవాళ్లు, విచారణలను ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ వేదికగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక వేధింపుల ఇమేజ్ ల షేరింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2024లో పారిస్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారనే అంశంపై కూడా అక్కడ దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+